సాహెబ్‌నగర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మ్యాన్‌హోల్‌లోకి దిగి డ్రైనేజీ క్లీనింగ్‌కు చేస్తున్న సమయంలో ఇద్దరూ కార్మికులు గల్లంతయ్యారు. అంతయ్య, శివ అనే కార్మికులు డ్రైనేజీ శుభ్రం చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, మున్సిపల్, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఆగ్నీ మాపక సిబ్బంది ఒకరి మృతిదేహాన్ని వెలుపలికి తీశారు. మ్యాన్‌హోల్‌లో ఊపీరిరాడక అతను మృతి చెందినట్లు తెలుస్తోంది, గల్లంతైన మరో కార్మికుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు































