తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా కార్తీకదీపం ఫేమ్ అర్థ పావు భాగ్యం అలియాస్ ఉమాదేవి ఎంటర్ అయ్యి రెండవ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ అర్థ పావు భాగ్యంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ హౌస్ లో బూతులు మాట్లాడటం వల్లే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిందని తెలుస్తోంది.

ఈ విధంగా రెండవ వారం నామినేషన్ లిస్ట్ లో ఉన్నటువంటి ఉమా దేవి ఎక్కువగా స్క్రీన్ స్పేస్ కోసం ఆమె ప్రతి చిన్న విషయానికి హౌస్ సభ్యులతో గొడవకు దిగడం, వారిని బూతులు తిట్టడం వల్ల ఈమెపై నెగిటివిటీ ఏర్పడి ఎలిమినేట్ అయ్యింది. ఇలా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఉమాదేవి ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.. తాను ఏ విషయం అయినా ముక్కుసూటిగా మాట్లాడతానని… ఇలా మాట్లాడటం వల్లే మిగతా కంటెస్టెంట్స్ తనని ఎంతో తప్పుగా అపార్థం చేసుకున్నారని తెలిపింది. ఏదిఏమైనప్పటికీ తను బిగ్ బాస్ హౌస్ నుంచి రెండవ వారం ఎలిమినేట్ కావడం చాలా బాధగా ఉందని.. ఇంకొన్ని రోజులపాటు బిగ్ బాస్ హౌస్ లో ఉంటే మరింత ఎంటర్టైన్ చేసే దానినని తెలియజేశారు.
చాలా మంది నెటిజన్లు బిగ్ బాస్ హౌస్ లో జరిగే ప్రతి ఒక్క సన్నివేశం కూడా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని భావిస్తారు. నిజానికి అక్కడ స్క్రిప్టు ప్రకారం ఏ చిన్న సన్నివేశం జరగదని… హౌస్ లో జరిగేదంతా కూడా చాలా జెన్యూన్ గా జరుగుతుందని ఈ సందర్భంగా ఉమాదేవి వెల్లడించారు. తనకు మరొక అవకాశం వస్తే తప్పకుండా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తానని ఈ సందర్భంగా ఉమాదేవి తెలియజేశారు.































