చెప్పిన సమయానికే.. చెప్పిన తేదీకే బిగ్ బాస్ 5 సీజన్ మొదలైంది. అదరి అంచనాలను అందుకుంటూ.. విజయవంతంగా దూసుకుపోతోంది. అయితే కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. అందులో చాలామంది ఎంతో కొంతో దేనిలో ఒక దానిలో ప్రావీణ్యం ఉన్నవాళ్లను తీసుకున్నారు నిర్వాహకులు.

కొందరు అందరికీ సుపరిచతం కాకపోయినా.. మరికొంత మంది తెలిసినవారు ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఈ హౌస్ లో మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది లహరి షెరి. అయితే ఆమె గురించి పెద్దగా తెలియదు. కానీ పలు సినిమాల్లో ఆమె చిన్న చిన్న పాత్రల్లో నటించారు. విజయ్ దేవరకొండలో నటించిన “అర్జున్ రెడ్డి” సినిమాలో ఆమె ఓ నర్సు క్యారెక్టర్ చేసింది.

చిన్న పాత్ర అయినా ఎంతో ఒదిగిపోయి నటించింది లహరి. ఆమె పూర్తి పేరు శరణ్య లహరి శర్మ. పుట్టింది.. పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే. ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే సెలెబ్రేషన్స్ అనే ప్రోగ్రాం ద్వారా ఆమె కెరీర్ ను మొదలు పెట్టారు. ఒక నటిగా, యాంకర్ గా.. ఇటు మహాన్యూస్ లో డిబేట్ వంటి వాటికి హోస్ట్ గా కూడా చేశారు లహరి. దివంగత కత్తి మహేశ్ తో చేసిన డిబేట్ లో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది.
పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ అంతా ఆమెకు ఎంతో సపోర్టుగా నిలిచారు. ఇప్పటికే పలు సనిమాల్లో నటించిన లహరి.. ప్రేక్షకుల ముందుకు రాబోయే సినిమా‘గని’లో కూడా ఆమె నటించింది. ఇలా ఆమె నటనలో మంచి ప్రావీణ్యం సంపాదించుకుంది. అంతే కాదు ఆమె డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పనిచేశారు.































