తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. బెల్లంకొండ శ్రీనివాస్ స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారి కొడుకు. ఇలా స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రీనివాస్ వరుస సినిమాలతో ప్రేక్షకులను సందడి చేశారు. ఈ క్రమంలోనే బెల్లంకొండ శ్రీనివాస్ ఫ్యామిలీ ఫోటోలను, తన ఫ్యామిలీ గురించి ఇక్కడ తెలుసుకుందాం…

బెల్లంకొండ శ్రీనివాస్ జనవరి 3 1993 లో గుంటూరులో జన్మించాడు. ఇతని స్కూల్, కాలేజ్ మొత్తం హైదరాబాద్ లోనే పూర్తయింది. గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కాలిఫోర్నియాలోని లీస్టస్ బర్గ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ లో శిక్షణ పూర్తి చేసుకుని ఇండియా తిరిగి వచ్చారు. ఇండియాకు తిరిగి వచ్చిన శ్రీనివాసన్ ను తన తండ్రి సురేష్ ఎంతో గ్రాండ్ గా ఇండస్ట్రీలోకి లాంచ్ చేశారు.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 2014 సంవత్సరంలో “అల్లుడు శీను” సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేశారు. ఇందులో సమంతా కథానాయికగా నటించిన ఈ సినిమాను స్వయంగా సురేష్ నిర్మించారు. మొదటి సినిమాతోనే ఎంతో హైప్ క్రియేట్ చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఆ తరువాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, రాక్షసుడు, సౌఖ్యం వంటి ఎన్నో చిత్రాలలో నటించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి కమర్షియల్ హిట్ అందుకోలేదని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా త్వరలోనే బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి మనకు తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న “ఛత్రపతి” సినిమా బాలీవుడ్ రీమేక్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ రీమేక్ చిత్రానికి వి.వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కు ఒక తమ్ముడు ఉన్నాడు అతని పేరు గణేష్. గణేష్ కూడా త్వరలోనే వెండితెర ఆరంగ్రేటం చేయనున్నారు. గణేష్ హీరోగా “స్వాతిముత్యం” అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడంతో ఈ పోస్టర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.































