సినీ ఇండస్ట్రీలో అగ్రహీరోలతో పాటు అగ్ర కథానాయకులు కూడా ఉన్నారు. కానీ వాళ్లు చాలా కాలం వరకు అదే పొజిషన్లో కొనసాగలేకపోయారు. ఎందుకంటే హీరోయిన్ కు మొదట గ్లామర్ పాత్ర ముఖ్యమైనది. అది యవ్వనంలో చూడటానికి బాగానే ఉంటుంది.. కానీ వయస్సు పెరుగుతున్న కొద్ది అది కాస్త తగ్గిపోతుంటుంది. దీంతో గ్లామర్ రోల్ తక్కువగా ఉండే పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు.. అగ్ర కాథానాయికల ప్లేస్ ను వేరొకరు ఆక్రమించుకుంటారు.

ఇలా ఏ హీరోయిన్ అయినా ఎక్కువ కాలం కొనసాగలేరు. అయితే అందులో ముఖ్యంగా చెప్పుకునే పేరు ‘భానుప్రియ’. మొదట ఆమె వంశీ దర్శకత్వం వహించిన “సితారా” సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేశారు. తర్వాత విభిన్న పాత్రల్లో నటించి తన నటనతో అభిమానులను మంత్ర ముగ్ధులను చేశారు. వెంటటేశ్ హీరోగా నటించిన “స్వర్ణకమలం” సినిమాతో ఆమెకు ఎక్కడ లేని గుర్తిపు తెచ్చింది. ఇదిలా ఉండగా.. వంశీని ఆమె అప్పట్లో ప్రేమించింది. పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో భానుప్రియ తల్లి ఒప్పుకోలేదు. ఎందుకంటే.. అతడికి అప్పటికే పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

దీంతో ఆమె ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. దీని కారణంగానే వంశీ తీవ్ర అనారోగ్యానికి గురై కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. భానుప్రియ కూడా ఇలాగే సినిమాలను చేయలేదు. తర్వాత వంశీ మతిస్థిమితం కోల్పోయారనే వార్తలు అప్పట్లో వచ్చాయి. తర్వాత భానుప్రియ 1998 సంవత్సరంలో ఎన్నారై కౌశల్ ను పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకు వారికి ఓ పాప పుట్టింది. తర్వాత 2005లో ఆమె అతడితో కొన్ని విభేదాల కారణంగా విడిపోయి ఇండియాకు వచ్చారు.

తర్వాత ఇక్కడే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఈ మధ్య తన భర్త కూడా చనిపోయారని తెలుసుకొని ఆమె ఎంతో క్రుంగిపోయింది. తర్వాత ఈ మధ్య ఓ మైనర్ బాలికను తన ఇంట్లో పనికి పెట్టుకున్నారని భానుప్రియ మీద పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదయింది. దీంతో ఆమెకు సమస్యలు ఒకటి మీద ఒకటి వచ్చిపడ్డాయి. భానుప్రియ సినీ జీవితం బాగానే ఉన్నా.. వ్యక్తిగత జీవితానికి వస్తే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పవచ్చు.






























