Upasana: ప్రెగ్నెన్సీ కోసం ఉపాసన అంత పని చేసిందా.. వైరల్ అవుతున్న ఉపాసన కామెంట్స్..?

0
22

Upasana: మెగా కోడలు ఉపాసన కామినేని ప్రస్తుతం గర్భవతిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరొక నెల రోజుల్లో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఉపాసన బిడ్డకు ఎప్పుడెప్పుడు జన్మనిస్తుందా అని కుటుంబ సభ్యులు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పడు అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

దీంతో ఉపాసన సోషల్ మీడియాలో ఏం షేర్ చేసినా కూడా నిమిషాలలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన చెప్పిన విషయాలు విని అందరూ షాక్ అవుతున్నారు. పెళ్ళి తరువాత పిల్లల కోసం ఉపాసన చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పెళ్లి తర్వాత పిల్లల్ని ఎప్పుడు కనాలి అనే విషయం గురించి ఇద్దరం ఒక నిర్ణయానికి వచ్చామని ఉపాసన తెలిపింది.

కెరీర్ పై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో పెళ్లి తర్వాత ఎగ్స్ ని ఫ్రిజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక ఆర్థికంగా వారిద్దరూ ఒక మంచి పొజిషన్ కి వచ్చిన తర్వాత పిల్లల్ని కనాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఉపాసన వెల్లడించింది. ప్రస్తుతం ఇద్దరు కూడా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుని,తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలమన్న నమ్మకం ఉంది కాబట్టి వారు ఇప్పుడు పిల్లల్ని కనాలన్నీ నిర్ణయించుకున్నట్లు ఉపాసనా వెల్లడించింది.

Upasana: ఎగ్స్ ఫ్రీజ్ చేసిన ఉపాసన…


అయితే ప్రస్తుతం పిల్లల కోసం పెళ్లి జరిగిన తర్వాత ఉపాసన తన ఎగ్స్ ని ఫ్రీజ్ చేసినట్లు చెప్పటంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుత కాలంలో ఉపాసన మాత్రమే కాకుండా ఎంతో మంది సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా ఇలా ఎగ్స్ ని ఫ్రీ చేసి వారు కోరుకున్నప్పుడు పిల్లల్ని కంటున్నారు. ఇదిలా ఉండగా మెగా వారసుడి రాక కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా బుల్లి మెగా పవర్ స్టార్ పుట్టాలని కోరుకుంటున్నారు.