Upasana Konidela:రామ్ చరణ్ భార్యగా, మెగా కోడలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసన అందరికీ సుపరిచితమే.ఈమె సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలను షేర్ చేయడమే కాకుండా అపోలో హాస్పిటల్ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఉపాసన తాజాగా సోషల్ మీడియా వేదికగా మరొక వీడియోని షేర్ చేశారు.

ఈ వీడియోలో ఉపాసన పంజాబ్ లోని అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ ని సందర్శించినట్టు తెలుస్తోంది. గోల్డెన్ టెంపుల్ లో ఉపాసన ప్రత్యేకంగా లంగర్ సేవలో పాల్గొన్నట్లు తెలియజేశారు. ఇక ఈ వీడియోని ఉపాసన పోస్ట్ చేస్తూ కృతజ్ఞతాభావంతో Mr.C అమృత్ సర్ లో లంగర్ సేవలను నిర్వహించారు.

అయితే ప్రస్తుతం రామ్ చరణ్ తన RC 15 సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఈ సేవలో పాల్గొన్న లేకపోయారు. ఆయన తరపున ఈ సేవలో పాల్గొనే అధికారం, హక్కు నాకు కల్పించినందుకు, రామ్ చరణ్ ప్రేమతో నన్ను ఆశీర్వదించబడటం ఎంతో వినయంగా అంగీకరిస్తున్నాను అంటూ ఉపాసన ఈ వీడియో ద్వారా వెల్లడించారు.
లంగర్ సేవలో ఉపాసన…
ఈ విధంగా రామ్ చరణ్ పాల్గొనవలసిన పూజలో ఉపాసన పాల్గొని పూజ నిర్విఘ్నంగా పూర్తి చేశారు. పూజ అనంతరం గురుద్వారా కమిటీ ఉపాసనకు గోల్డెన్ టెంపుల్ చిత్రపటాన్ని అందించారు. ఆర్ఆర్ఆర్ విజయవంతం కావడంతో రామ్ చరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు RRR చిత్ర బృందంతో కలిసి ఉపాసన కూడా గోల్డెన్ టెంపుల్ ను సందర్శించిన విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా అమృత్ సర్ లో జరుగుతోంది.
As a mark of gratitude Mr.C hosted a langar seva at the golden temple in Amritsar.
— Upasana Konidela (@upasanakonidela) April 19, 2022
I had the privilege & opportunity to represent him by participating in the seva as he was shooting for #RC15
Rc & I feel blessed with with your love & accept it with humility @AlwaysRamCharan pic.twitter.com/Tz8GYDO4bx





























