Upasana: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇలా వివాహ వేడుకకు కేవలం మెగా కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇలా వీరి నిశ్చితార్థ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరగడమే కాకుండా ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇలా మెగా కుటుంబ సభ్యులందరూ వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా పెద్ద కోడలు ఉపాసన సైతం ఈ నిశ్చితార్థ వేడుకలలో సందడి చేశారు. ఈమె ఎనిమిది నెలల గర్భిణీ అయినప్పటికీ నిశ్చితార్థ వేడుకలలో పాల్గొని కాబోయే వధువరులను ఆశీర్వదించారు.

ఈ విధంగా ఉపాసన రాంచరణ్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉపాసన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఉపాసన స్పందిస్తూ డియరెస్ట్ లావణ్య వెల్కమ్ టు కొణిదెల ఫ్యామిలీ. తోటి కోడలుగా నీ రాక కోసం ఎదురుచూస్తున్నాను. నీ రాకతో వరుణ్ చాలా సంతోషంగా ఉన్నారు అంటూ పోస్ట్ చేశారు.
Upasana: తోడికోడలుగా ఎదురు చూస్తున్న…
ఇలా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా కోడలుగా మెగా కుటుంబ పరువు ప్రతిష్టలను లావణ్య త్రిపాఠి ఎంతో కాపాడుతూ రావడమే కాకుండా మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారు. ఇక మెగా ఇంటికి రెండో కోడలుగా నటి లావణ్య త్రిపాఠి రాబోతున్న నేపథ్యంలో తన తోటి కోడలు కోసం ఎదురుచూస్తున్నాను అంటూ ఉపాసన షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Welcome to the Konidela family dearest Lavanya ????❤️
Looking forward to celebrating my dearest thodi kodalu.
Varunnnnnn soooooo happy for you. @Itslavanya @IAmVarunTej pic.twitter.com/69mMin4tXf— Upasana Konidela (@upasanakonidela) June 10, 2023































