Upasana: ఉపాసన కోసం విదేశాల నుంచి స్పెషల్ ఫ్రూట్స్ పంపిన వ్యక్తి… ప్రేమకు ఫిదా అవుతున్న నెటిజన్స్!

0
82

Upasana: మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. మరొక నెలలో ఈమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.ఇలా ఉపాసన డెలివరీ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అభిమానులలో కాస్త ఆత్రుత కూడా నెలకొంది.మెగా ఇంటిలోకి వారసుడు అడుగుపెట్టబోతున్నారా లేక వారసురాలు అడుగుపెట్టబోతున్నారా అన్న విషయం గురించి కంగారు వ్యక్తం చేస్తున్నారు.

ఇక మెగా లెగసి కొనసాగాలి అంటే తప్పకుండా రామ్ చరణ్ కుమారుడు పుట్టాలని కొందరు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.ఇలా రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్త అందరినీ ఎంతో సంతోషానికి గురిచేస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ప్రెగ్నెన్సీ తో ఉన్నటువంటి ఉపాసన నెలలు కూడా నిండడంతో ఈమె ఇంటికి పరిమితం అయ్యారు.ఇక ప్రెగ్నెన్సీ తో ఉన్నటువంటి మహిళలు తమ బిడ్డ ఆరోగ్యం కోసం ఎంతో ప్రత్యేకమైన డైట్ ఫాలో కావాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఎన్నో పోషక విలువలు అందించే కొన్ని ప్రత్యేకమైన ఫ్రూట్స్ ను రష్యా నుంచి ఓ వ్యక్తి తనకు కానుకగా పంపించారని తెలుస్తోంది.ఇలా ప్రేమతో ఉపాసన కోసం రష్యా నుంచి పండ్లు పంపించిన ఆ వ్యక్తి మరెవరో కాదు ఉపాసన చిన్నత్త పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజినోవా. ఈమెను పవన్ కళ్యాణ్ మూడో వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈమె తన పిల్లలతో కలిసి రష్యాలోనే ఉంటున్నారు.

Upasana: స్పెషల్ ఫ్రూట్స్ పంపిన పవన్ భార్య…

అయితే ఉపాసన ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసినటువంటి ఈమె రష్యాలో దొరికే కొన్ని రకాల పండ్లను ఉపాసన కోసం ప్రత్యేకంగా పంపించి ఉపాసన పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమను తెలియజేశారు. ఇలా ఉపాసన కోసం రష్యా నుంచి ప్రత్యేకంగా ఫ్రూట్స్ పంపించారనే విషయం తెలియడంతో అభిమానులు వీరి మధ్య ఉన్నటువంటి ప్రేమకు ఫిదా అవుతున్నారు.