Upasana: మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం గర్భంతో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. పెళ్లి జరిగిన పది సంవత్సరాలకు రాంచరణ్ ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో అటు కుటుంబ సభ్యులు, ఇటు మెగా అభిమానులు కూడా మెగా వారసుడి కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా హైదరాబాద్లోని చిరంజీవి నివాసంలో ఉపాసన సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి.

ప్రస్తుతం ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సీమంతం వేడుకకు మెగా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.ఈ సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలను ఉపాసన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. అలాగే కొన్ని రోజుల క్రితం ఉపాసన రామ్ చరణ్ కలిసి దుబాయ్ వెకేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉపాసన స్నేహితులు ఆమెకు సీమంతం వేడుక నిర్వహించారు.
ఉపాసన గర్భంతో ఉన్నప్పటికీ కడుపులో పెరుగుతున్న బిడ్డతో పాటు భర్తతో కలిసి దేశ విదేశాలు తిరుగుతూ వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది..గతంలో ఆస్కార్ అవార్డుల కోసం రామ్ చరణ్ అమెరికా వెళ్లగా ఉపాసన కూడా రామ్ చరణ్ తో పాటు అమెరికా వెళ్ళింది. ఇక ఇటీవల రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ కలిసి దుబాయిలో వెకేషన్ ఎంజాయ్ చేశారు.

Upasana: అత్తయ్య సురేఖతో ఉపాసన…
ఆ తర్వాత అటు నుంచి అటే మాల్దీస్ కి వెళ్లారు. రామ్ చరణ్,ఉపాసనా ఇద్దరు కూడా తమ మొదటి బిడ్డ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంతకాలం పిల్లల గురించి ఉపాసన ఎన్నో విమర్శలు ఎదురుకుంది. ఇక ఇప్పుడు మాతృత్వంలో మాధుర్యాన్ని అనుభవిస్తోంది. తాజాగా ఈమె షేర్ చేసిన బేబీ షవర్ ఫోటోలలో తన అత్తయ్య సురేఖతోపాటు అల్లు అర్జున్ అన్నయ్య బాబి భార్య అల్లు నీలుషా ఉన్నారు ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.































