Upasana: ఉపాసన కొనిదెల పరిచయం అవసరం లేని పేరు మెగా కోడలుగా రామ్ చరణ్ సతీమణిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసన ఒక బిజినెస్ మెన్ గా కూడా మంచి గుర్తింపు పొందారు.అపోలో హాస్పిటల్ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే ఈమె మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తూ మంచి మనసున్న మహిళగా పేరు సంపాదించుకున్నారు.

ఇలా ఉపాసన మెగా కోడలు పరువు ప్రతిష్టలను పెంచుతూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.ఇకపోతే ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. పెళ్లి తర్వాత దాదాపు పది సంవత్సరాలకు వీరిద్దరూ పిల్లలను ప్లాన్ చేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్ది నెలలలో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.
ఈ క్రమంలోనే ఉపాసన కోరిక మేరకు తనకు ఇష్టమైన ప్రదేశాలకు రామ్ చరణ్ తీసుకెళ్తూ తనని సంతోషంగా ఉంచుతున్నారు. ఇదివరకు వీరిద్దరూ దుబాయ్ మాల్దీవ్స్ వెకేషన్ లో ఎంజాయ్ చేసి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఉపాసన ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

Upasana: ప్రేమతో చేసిన పులావ్…
ఈ క్రమంలోనే ఈమె ట్విటర్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో భాగంగా చిరంజీవి గారి తల్లి అంజనాదేవి ఉపాసన కోసం ప్రత్యేకంగా పులావ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన వీడియోని ఉపాసన షేర్ చేస్తూ..నాయనమ్మ ప్రేమతో చేసిన పులావ్ ఇంతకన్నా ఏం కావాలి అంటూ ఈ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Sunday Pulao made with loads of love ❤️. What more can I ask for. ???????????? pic.twitter.com/EegIdtsU80
— Upasana Konidela (@upasanakonidela) April 16, 2023
































