యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా ప్రతిఒక్కరూ సులభంగా డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. కొందరు ఈ ప్రయత్నాల్లో సులభంగా సక్సెస్ అయితే మరి కొందరు ఎంత ప్రయత్నించినా సక్సెస్ కారు. అయితే కొన్ని కంపెనీలు మాత్రం పలు సందర్భాల్లో కొంతమంది అతి సులువుగా డబ్బు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి. అమెరికాకు చెందిన బోనస్‌ఫైండర్ కంపెనీ సినిమాలు చూస్తే 36 వేలు పొందే అవకాశం కల్పిస్తోంది.
బోనస్‌ఫైండర్ సినిమాలు పిజ్జాలు తింటూ నెట్ ఫ్లిక్స్ లో సినిమాలు చూస్తే 36వేల రూపాయలు ఇవ్వనుంది. అయితే అందరూ ఈ విధంగా 36 వేల రూపాయలు పొందలేరు. కంపెనీ ఎంపిక చేసుకున్న ఒక్క వ్యక్తి మాత్రమే ఈ విధంగా 36వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన నేషనల్ పిజ్జా డేగా జరుపుకుంటారు. ఆరోజు పిజ్జా తిని సినిమాలు చూసి 500 డాలర్లు పొందవచ్చు.
మన కరెన్సీలో 500 డాలర్లు అంటే 36,000 రూపాయలు. ఈ ఆఫర్ పై ఆసక్తి ఉన్నవాళ్లు బోనస్‌ఫైండర్ కంపెనీ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థి ఈ ఆఫర్ కు ఏ విధంగా అర్హుడనే విషయాన్ని వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఎవరైతే సరిగ్గా వివరణ ఇస్తారో వారు మాత్రమే ఈ ఆఫర్ పొందడానికి అర్హులవుతారు.
బోనస్ ఫైండర్ వెబ్ సైట్ ద్వారా ఈ ఆఫర్ కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. అయితే ఒక్కరికి మాత్రమే ఈ ఆఫర్ ఉండటంతొ ఒక్క అదృష్టవంతుడు మాత్రమే 36,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.