Vaishnav Tej : మెగా కాంపౌండ్ నుండి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరోలలో వైష్ణవ్ తేజ్ కూడా ఒకరు. సాయి ధరమ్ తేజ్ కు సోదరుడు అయిన వైష్ణవ్ తేజ్ 2003 లో వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా ‘జానీ’ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదట కనిపించారు. తరువాత మెగాస్టార్ సినిమా ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ లో కూడా నటించారు. అయితే 2021 లో వచ్చిన ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. తరువాత వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా ‘కొండ పొలం’ సినిమాలో నటించారు.

చాలా ఇష్టమైన స్టార్ ఫోటో ని ఫోన్ వాల్ పేపర్ గా…
వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ‘రంగ రంగ వైభవంగా’ అనే సినిమా చేస్తున్నారు. వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ, నవీన్ చంద్ర ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ట్రైలర్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా చేస్తున్న వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ లు తాజాగా ఒక ఇంటర్వూలో పాల్గొన్నారు. సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ భాగా కుదిరిందని, సినిమా కచ్చితంగా అందరినీ బాగా ఆకట్టుకుంటిందని చెప్పుకొచ్చారు.

ఇక వైష్ణవ్ తేజ్ ఫోన్ లో ఎవరి ఫోటో వాల్ పేపర్ గా ఉంటుంది అని అడుగగా… ఏకంగా ఫోనే చూయించారు. తన ఫోన్ లాక్ స్క్రీన్ కు ఆంజనేయస్వామి ఫోటో ఉండగా, ఇక వాల్ పేపర్ గా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఫోటో వుంది. సోనాక్షి అంటే చాలా ఇస్టమని అందుకే ఎప్పుడు తన ఫోటో వాల్ పేపర్ గా ఉంటుందని చెప్పాడు. వరుణ్ తేజ్ ‘గద్దల కొండ గణేష్’ సినిమా షూటింగ్ సమయంలో అక్కడ ‘భుజ్ ది ప్రైడ్ అఫ్ ఇండియా’ సినిమా షూటింగ్ కోసం సోనాక్షి అక్కడికి వచ్చిందని వరుణ్ చెప్పగా, వెంటనే వెళ్లి కలిశానని తన ఆనందాన్ని తెలియజేసాడు.































