Vanitha Vijay Kumar: ప్రముఖ సినీ నటుడు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తె వనితా విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమాలలో కన్నా ఎక్కువ కాంట్రవర్సీల ద్వారా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భర్తలకు విడాకులిచ్చి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.

ఇలా నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలిచే ఈ కాంట్రవర్సి బ్యూటీ తాజాగా జబర్దస్త్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ కార్యక్రమంలోకి ఎంతో మంది కొత్త వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు.అలాగే ఈ కార్యక్రమంలో ఎన్నో సంవత్సరాల నుంచి కమెడియన్ గా పనిచేస్తున్న వారందరూ ఒక్కసారిగా మాయమవుతున్నారు.

ఇలా ఎంతో మంది కమెడియన్స్ ఇప్పటికే ఈ కార్యక్రమం నుంచి తప్పుకోగా, ఎంతో మంది కొత్తవారు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో భాగంగా జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి రోజా ఈ వారం కూడా కనిపించలేదు. రోజా స్థానంలో నటి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.రోజాకు మంత్రి పదవి ఖాయమైందని, అందుకే ఈ కార్యక్రమానికి రావడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
కామెడీతో ఆకట్టుకున్న వనితా…
ఇక ఈ వారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో జబర్దస్త్ వేదికపైకి కాంట్రవర్సి బ్యూటీ వనితా విజయ్ కుమార్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఒక స్కిట్ లో భాగంగా తన కామెడీ పంచ్ లతో అందరిని నవ్వించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఎన్నో వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన వనిత ఈ విధంగా జబర్దస్త్ వేదికపైకి ఎంట్రీ ఇవ్వడంతో ఇక షోలో ఎలాంటి రచ్చ జరుగుతుందో తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.


































