Varun -Lavanya: వరుణ్ తేజ్ లావణ్య పెళ్లికి భారీగా ప్లాన్ చేశారుగా… ఆ పద్ధతిలో జరగనున్న వివాహం?

0
105

Varun -Lavanya: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉంటూ వీరి ప్రేమ విషయాన్ని ఎక్కడ బయటపడకుండా జాగ్రత్త పడ్డారు అయితే ఒక్కసారిగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోబోతున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ జూన్ 9వ తేదీ నాగబాబు ఇంట్లో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.

ఈ విధంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థపు వేడుక జరగడంతో త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది అంటూ వీరి పెళ్లి గురించి రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే ఆగస్టు చివరి వారంలో వీరి వివాహం డెస్టినేషన్ పద్ధతిలో ఇటలీలో జరగబోతుందని సమాచారం. ఇటలీలోనే వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ విషయం బయటపడిందని ఇక్కడే వారు వివాహం చేసుకోవాలని భావించినట్టు తెలుస్తుంది.

ఈ విధంగా ఇటలీలో వీరి వివాహ వేడుకను ఎంతో అంగరంగ వైభవంగా చేయడానికి మెగా కుటుంబం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట అయితే ఈ వివాహానికి కేవలం 50 మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కాబోతున్నట్టు సమాచారం ఇటలీలో వివాహం చేసుకున్న అనంతరం హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎంతో ఘనంగా సినీ సెలబ్రిటీలు అందరిని ఆహ్వానించి గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Varun -Lavanya: ఇటలీలో మొదలైన పెళ్లి పనులు…


ఇక ఇటలీలో వీరి వివాహం రాజరికపు పద్ధతిలో చేయాలని ప్లాన్ చేశారట. ఇప్పటికే కొందరు వెడ్డింగ్ ప్లానర్స్ ఇటలీ చేరుకొని అక్కడ వివాహ పనులు అన్నింటిని కూడా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తుంది.గత కొంతకాలంగా మెగా కుటుంబంలో వరుసగా చేదు వార్తలు వింటూనే ఉన్నారు. అయితే రామ్ చరణ్ కుమార్తె జన్మించడం వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోవడం వంటి శుభవార్తలతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా సంతోషంగా ఉన్నారు.