Varun Sandesh: హ్యాపీ డేస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి హీరో వరుణ్ సందేశ్ అనంతరం పలు సినిమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈ మధ్యకాలంలో ఈయన సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారని చెప్పాలి.కెరియర్ మొదట్లో వరుణ్ సందేశ్ సినిమాలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసినప్పటికీ అనంతరం తీవ్ర నిరాశ కలిగించడంతో ఈయనకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

ఇకపోతే ఇండస్ట్రీలో ఈయన హీరోగా కొనసాగుతున్న సమయంలో ఈయనకు నటి శ్రద్ధాదాస్ మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ విడిపోయారని వార్తలు ఓ రేంజ్ లో వార్తలు చెక్కర్లు కొట్టాయి.అయితే ఒకానొక సందర్భంలో వీరిద్దరి ప్రేమకు బ్రేకప్ చెప్పుకోవడానికి గల కారణాలను కూడా శ్రద్ధాదాస్ వివరించారు.
వరుణ్ సందేశ్ 2010వ సంవత్సరంలో నటించిన మరోచరిత్ర సినిమాలో శ్రద్ధాదాస్ హీరోయిన్గా కాకుండా ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ద్వారా ఏర్పడిన పరిచయం అనంతరం వీరి మధ్య ప్రేమగా మారింది. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే వరుణ్ సందేశ్ కు తానే బ్రేకప్ చెప్పానంటూ ఓ ఇంటర్వ్యూ సందర్భంలో శ్రద్ధాదాస్ వెల్లడించారు.

Varun Sandesh: వరుణ్ సందేశ్ తల్లిదండ్రులే కారణమా…
ఈ విధంగా వీరిద్దరి ప్రేమకు బ్రేకప్ కావడానికి వరుణ్ సందేశ్ పేరెంట్స్ కారణమని ఈమె వెల్లడించారు. వరుణ్ సందేశ్ తనని ప్రేమించడం వల్ల ఆయనకు తన పేరెంట్స్ నుంచి కాస్త వ్యతిరేకత ఏర్పడింది. అందువల్ల తానే వరుణ్ సందేశ్ కు బ్రేకప్ చెప్పానంటూ శ్రద్ధాదాస్ అసలు విషయం వెల్లడించారు. ఇక వీరిద్దరికి బ్రేకప్ కావడంతో వరుణ్ సందేశ్ తన కో స్టార్ వితికను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు.

































