మెగా హీరో వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ‘ఫిదా’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం హిట్ సినిమాకు కొత్తం అర్దం చెప్పినట్లుగా కలెక్షన్స్ వర్షం కురిపించింది..అంతేకాదు సినిమాలో సాయి పల్లవి తన అందం, అభినయం తో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసింది.. అంతే కేవలం ఆ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారి ఫుల్ బిజీ అయ్యిపోయింది.

దాంతో ఇప్పుడు అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా డైరక్టర్, ఏమా కథ అంటారా..కరోనా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు వరుణ్ తేజ్. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’ అనే స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నారు వరుణ్ తేజ్.అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌తో కలసి ‘ఎఫ్ 3’ చిత్రంలోనూ నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ రెండు సినిమాల చిత్రీకరణకు బ్రేక్ పడింది.
ఈ గ్యాప్‌లోనే ‘ఛలో, భీష్మ’ చిత్రాల ఫేమ్ వెంకీ కుడుముల చెప్పిన స్టోరీ లైన్ విన్నారట వరుణ్. వెంకీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వరుణ్ తేజ్.ప్రస్తుతం నటిస్తున్న ‘గని, ఎఫ్ 3’ చిత్రాల షూటింగ్ పూర్తయిన వెంటనే వెంకీ కుడుముల ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారని సమాచారం. అన్నీ కుదిరితే దసరాకి చిత్రీకరణ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుందని తెలిసింది.
ఈ సినిమాలో వరణ్ సందేశ్ సరసన సాయి పల్లవిని ఎంపిక చేసారు. ప్రస్తుతం ఈ మేరకు టాక్స్ జరుగుతున్నాయి. అయితే కరోనా సమస్యతో డేట్స్ అందరివీ డిస్ట్రబ్ అయ్యిపోయాయి. దాంతో సాయి పల్లవి తను ఖచ్చితంగా ఫలానా తేదీ నుంచి డేట్స్ ఇవ్వగలను అని చెప్పలేనని అందిట. ఇక మరోవైపు దర్శకుడు వెంకీ ఇప్పటికే వరుణ్ కి ఒక నెరేషన్ ఇచ్చాడు. త్వరలోనే ఫైనల్ స్క్రిప్ట్ చెప్పాల్సి ఉంది. ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దే పనిలో బిజీగా ఉన్నాడు వెంకీ కుడుముల..!!



























