Varun Tej: కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ కలిసి నటించిన తాజా చిత్రం గని. ఈ సినిమా నేడు అనగా ఏప్రిల్ 8న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే సమయం వచ్చేసింది. ఇకపోతే ఈ సినిమా ఎమోషన్స్ లో భాగంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. తాత తండ్రి నాగబాబు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలగురించి పంచుకున్నారు. నా పెళ్లి ఎప్పుడు అని మా నాన్న ను తరచుగా అభిమానులు అడుగుతూ ఉంటారట, అయితే పెళ్లి విషయాన్ని పూర్తిగా మా నాన్న నాకే వదిలేశాడు అని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్. అనంతరం మీ నాన్నను మీరు అడగాల్సిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా అని యాంకర్ ప్రశ్నించడంతో.. ఆ విషయంపై స్పందించిన వరుణ్ తేజ్..

ఒకప్పుడు చాలా ఉండేవి. మా నాన్నతో మాట్లాడాలి ఏదైనా అడగాలి అంటేనే భయంగా ఉండేది. కానీ నేను హీరోగా మారి సినిమా మూడు సినిమాలు చేసిన తర్వాత కూడా మా నాన్నతో మాట్లాడాలి అంటే భయపడేవాడిని. కానీ ప్రస్తుతం మా నాన్నతో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాను. ఇప్పటికే అడగాల్సిన ప్రశ్నలు అని అడిగేసాను. అభిమానులు అడిగే ప్రశ్నల్లో దాదాపుగా చాలా వరకూ నేనే అడిగేశాను అని తెలిపాడు వరుణ్ తేజ్.
షూటింగ్ లో ఉంటే ఎలా సాధ్యం…
అలాగే నాకు,నిహారిక కు ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటారు. అలా అడగవద్దు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా మా నాన్న వినకుండా అలానే చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఆయన షూటింగ్ లో ఉంటే ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడని అడుగుతూనే ఉంటారని తెలిపాడు వరుణ్ తేజ్. షూటింగ్ లో ఉన్నాం అని చెబితే తొందరగా వచ్చేయండి అని అంటారు.. షూటింగ్ లో ఉంటే ఎలా త్వరగా వస్తాం.. కానీ ఒక తండ్రిగా మా నాన్న మమ్మల్ని అడుగుతూనే ఉంటారు అని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.



























