సాధారణంగా మనం రోడ్డు క్రాస్ చేయాలంటే రోడ్డుకిరువైపులా చూసి ఎటువంటి వాహనాలు రాకపోతే మనం రోడ్డు దాటుతాము. జంతువులు అలా కాదు. అవి ఇష్టానుసారంగా రోడ్డు దాటడం వల్ల చాలా జంతువులు రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఓ చిన్న కుక్క పిల్ల రోడ్డు దాటడానికి ప్రయత్నించింది. అయితే రోడ్డుపై పెద్దఎత్తున వాహనాల రాకపోకలతో ఆ కుక్కపిల్ల రోడ్డు దాటలేక భయంతో రోడ్డుపై అలాగే కదలకుండా ఉంది. ఆ రోడ్డుపై వెళ్లే వాహనాలు ఆ కుక్కపిల్ల పక్కన వెళుతూ ఉండగా భయంతో వణికి పోతోంది.ఇక ఒక ట్రక్ అయితే ఏకంగా ఆ కుక్కపిల్ల పై వెళ్లడంతో దాని ప్రాణాలు పోయినంత పనైంది. అయితే ఆ కుక్కపిల్ల ట్రక్ మధ్యలో ఉండటంతో దానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఈ విధంగా రోడ్డుపై భయంతో ఉన్నటువంటి ఆ కుక్కపిల్ల దగ్గరకు సడన్ గా ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తి మానవతా హృదయంతో కారుదిగి ఆ కుక్క పిల్లను చేతిలో పట్టుకొని ఎంతో ప్రేమగా దానిపై నిమురుతూ దానికి ధైర్యం కల్పించాడు. ఈ క్రమంలోనే ఆ కుక్క పిల్లను ప్రేమగా తన దగ్గరికి చేర్చుకొని తన కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు సదరు వ్యక్తి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.































