జూన్ లో రానున్న ‘దృశ్యం2’.. ఓటీటీ లోనా.. లేక థియేటర్స్ లోనా..??

0
88

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. ప్రస్తుతం నారప్ప అనే సినిమాలో నటిస్తున్నాడు వెంకీ.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు వెంకీ. తమిళ్ లో సూపర్ హిట్ సాధించిన అసురన్ సినిమాకు ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కుతుంది. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఇదిలా ఉంటే ఈ సినిమాతోపాటు ఎఫ్ 3, దృశ్యం 2 సినిమాలు చేస్తున్నాడు వెంకీ.

వీటిలో దృశ్యం 2 కు సురేశ్ బాబు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను మలయాళంలో కేవలం 45 రోజుల్లోనే తీసాడు దర్శకుడు జీతూ జోసెఫ్. థియేటర్స్ జోలికి వెళ్లకుండా ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల చేసారు..ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది..అంతేకాదు సినిమా కథను దర్శకుడు చెప్పిన విధానం.. స్క్రీన్ ప్లే సైతం విమర్శలకుల ప్రశంసలు అందుకుంది..

అయితే తెలుగులో రీమేక్ అవుతున్న దృశ్యం 2 కూడా ఓటీటీ వేదికగానే విడుదలవుతుందని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి చెందిన ఒక ప్రముఖ సంస్థవారు భారీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాతలు అంగీకరించారనీ, అందువలన ఈ సినిమా ఓటీటీ ద్వారానే రానుందనే టాక్ నడుస్తుంది. దృశ్యం 2 ను మొదటి నుండి కూడా జూన్ లో విడుదల చేస్తారనే వార్తలు వచ్చాయి.

అన్నట్లుగానే జూన్ లోనే సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నారట. అయితే అది ఓటీటీలో అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కుతుంది కాబట్టి ఓటీటీలో విడుదల చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఈ సినిమా ఓటీటీ లో రిలీజ్ అవుతుందా.. లేక థియేటర్స్ లో విడుదల అవుతుందా..అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here