Venu Madhav:టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో కమెడియన్ గా తన కామెడీ టైమింగ్ తో అందరిని నవ్వించిన వారిలో కమెడియన్ వేణుమాధవ్ ఒకరు.మిమిక్రీ ఆర్టిస్టుగా తన కెరియర్ ప్రారంభించిన ఈయన అనంతరం కమెడియన్ గా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన అవకాశాలను అందుకొని తన కామెడీ ద్వారా ప్రతి ఒక్కరిని నవ్వించారు.

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన సాంప్రదాయం అనే సినిమా ద్వారా కమెడియన్ గా తన కెరియర్ ప్రారంభించిన ఈయన తన సినీ కెరియర్ లో సుమారు 400 పైగా సినిమాలలో నటించి మెప్పించారు. ఇలా ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగుతూ భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్న ఈయన అనంతరం సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇకపోతే ఈయన బాగా మద్యం తాగి ఆయన లివర్ పాడవటం వల్లే మృతి చెందారని వార్తలు వచ్చాయి.
ఇకపోతే తాజాగా వేణుమాధవ్, కుటుంబ సభ్యులు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వేణుమాధవ్ మృతికి గల కారణాలను వెల్లడించారు. వేణుమాధవ్ భార్య మాట్లాడుతూ అందరూ అనుకున్న విధంగా ఆయన మద్యానికి అలవాటు పడి దానివల్ల చనిపోలేదని ఆయన చనిపోవడానికి డెంగ్యూ ఫీవర్ కారణమని వెల్లడించారు. డెంగ్యూ ఫీవర్ రావటం వల్ల కాస్త నిర్లక్ష్యం చేయడంతోనే అది విషమంగా మారిందని పేర్కొన్నారు.

Venu Madhav: డిప్రెషన్ లోకి వెళ్లారు..
వేణు మాధవ్ గారు చనిపోయే మూడు నెలల ముందు తన సోదరుడు కూడా మృతి చెందాడు. ఈ క్రమంలోని ఆయన డిప్రెషన్ లోకి కూడా వెళ్లారని ఈ సందర్భంగా వేణుమాధవ్ భార్య, తన కుమారులు ఈ సందర్భంగా ఆయన మృతికి గల కారణాలను తెలిపారు.ఇక ఆయన కుమారులు సైతం ఇదే విషయంపై మాట్లాడుతూ నాన్న మద్యం వల్ల చనిపోలేదని ఫీవర్ రావటం వల్లే నెగ్లెట్ చేయడం వల్ల చనిపోయారంటూ క్లారిటీ ఇచ్చారు.































