Venu Swamy: వేణు స్వామి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు. ఈయన సినిమా సెలబ్రిటీల జాతకాలని చెబుతూ వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈయన ప్రభాస్ జాతకం గురించి చెబుతూ తరచు వార్తల్లో నిలుస్తున్నారు. ప్రభాస్ ఇటీవల కాలంలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ జాతకం ఏ మాత్రం బాగాలేదని వేణు స్వామి పలు సందర్భాలలో తెలిపారు.

ఈయన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేవని సినిమాల పరంగా ప్రభాస్ కు నిరాశ ఎదురవుతుందని తెలిపారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఈయనని ట్రోల్ చేశారు. అంతేకాకుండా ప్రభాస్ పెద్దమ్మ ప్రభాస్ జాతకం ఆయనకు ఎలా తెలుసు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సలార్ విషయంలో వేణు స్వామి మాటలు తప్పు కావడంతో చాలామంది అభిమానులు ఈయనపై ట్రోల్స్ చేశారు.
తాజాగా మరోసారి వేణు స్వామి ప్రభాస్ జాతకం గురించి మాట్లాడుతూ తాను ప్రభాస్ జాతకం గురించి చెప్పిన మాటలు నిజమయ్యాయని తెలిపారు. ప్రభాస్ సినిమాలు నిరాశ పరుస్తాయని చెప్పాను ఆది పురుష్ పూర్తిగా నిరాశపరిచింది. అంతేకాకుండా సలార్ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ తప్ప ఎవరూ చూడరని చెప్పాను అది కూడా నిజమైందని తెలిపారు.
ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు..
ఇక ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఈ మాట కూడా వాస్తవమేనని నాలా జాతకాలు చెప్పే వాళ్ళు ఇండియాలోనే లేరని నేను చెప్పినది జరుగుతుంది అంటూ మరోసారి వేణు స్వామి ప్రభాస్ జాతకం గురించి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈసారి వేణు స్వామి వ్యాఖ్యలపై ప్రభాస్ ఫాన్స్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.































