Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ.. కాంట్రవర్సీకా బాప్ అంటారు ఈయనను. ఎందుకంటే.. ఈ డైరెక్టర్ ఏం చేసినా సంచలనమే. సమకాలీన అంశాల ఆధారంగా సినిమాలు తీస్తూ క్యాష్ చేసుకుంటారు. నేరాలు, ఘోరాలు, శృంగారం, రాజకీయాలు… ఇటీవల వీటిపైనే ఎక్కువ మూవీలు తీస్తుంటారు ఆర్జీవీ.

కేవలం సినిమాలే కాదు.. అప్పుడప్పుడు సామాజిక అంశాలు, రాజకీయాలపైనా తన దైన శైలిలో స్పందిస్తుంటారు ఆర్జీవీ. తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతడు పుష్ప సినిమాకు సంబంధించి ఆ ట్వీట్ చేశాడు. ఇటీవల పుష్ప సినిమా విడుదలై అన్ని భాషల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
Disney+ Hotstar: డిస్నీ+హాట్ స్టార్ యూజర్లలకు గుడ్ న్యూస్.. కొత్త ఆఫర్ అందుబాటులోకి..!
ముఖ్యంగా హిందీలో ఎప్పుడూ లేనంతగా.. విపరీతంగా దూసుకుపోతోంది. బన్నీ చిత్రాలు హిందీలో డబ్ కావడంతో.. అక్కడ అతడికి ఫ్యాన్స్ పెరిగారు. దీనికి క్యాష్ చేసుకొని బన్నీ మొదటి సారిగా పాన్ ఇండియా లెవల్లో సినిమాను ప్లాన్ చేసి.. మొదటి పార్ట్ ను విడదల చేశారు. అనుకున్నట్లుగానే మంచి విజయం సాధించింది. ఇక హిందీలో మంచి విజయం సాధించడంతో..దీనిపై వర్మ ట్వీట్ చేశాడు.

బాలీవుడ్.. హాలీవుడ్ వెంట పడుతుంటే.. టాలీవుడ్ మాత్రం.. బాలీవుడ్ వెంట పడుతోంది అంటూ ట్వీట్ చేశాడు. వివరంగా చెప్పాలంటే.. స్పైడర్‌మాన్, పుష్ప హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ.. హాలీవుడ్ వెనుక పరుగెడుతున్న బాలీవుడ్‌ని, టాలీవుడ్ వెంటాడుతోందని అర్థం వచ్చేలా మెసేజ్ ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతూ మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇక హిందీలో పుష్ప సినిమాతో పాటు.. కలెక్షన్లు కురిపిస్తున్న మరో సినిమా హాలీవుడ్ సినిమా స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ . ఇది కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.





























