సాధారణంగా మనం రోడ్డుపై ప్రయాణించేటప్పుడు మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎంతోమంది చిన్న పిల్లలు పుస్తకాలు అమ్ముతూ, బొమ్మలు అమ్ముతూ కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారిని చూసినప్పుడు వారికి మనకు తోచిన ఆర్థిక సహాయం చేసి అంతటితో సరి పెట్టుకుంటాం. కానీ ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో ఆ పసి మనసులకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం..

ఈ వీడియోలో ఓ వీధి బాలుడు ఒక కారు వద్దకు వెళ్లి తనకు ఏదైనా సహాయం చేయాలని అడగగా కారులో నుంచి మరొక బాలుడు అతని దగ్గర ఉన్న డబ్బులను తీసి ఇచ్చాడు. అదే విధంగా ఆ బాలుడు ఆడుకోవడానికి తన వద్ద ఉన్న ఒక జెసిబి బొమ్మను కూడా ఇస్తాడు. అలాగే ఇద్దరు కలిసి బొమ్మ కార్లతో కలసి సరదాగా ఆడుకున్నారు.
ఈ విధంగా ఆడుకోవడమే కాకుండా ఆ బాలుడు తనకి డబ్బులు ఇచ్చి ఏదో తినడానికి తీసుకురమ్మంటాడు. ఈ విధంగా ఆ బాలుడు తెచ్చిన పదార్థాలను ఇద్దరు కలిసి ఏ విధమైనటువంటి కల్మషం మనసులో లేకుండా తింటారు. ఇక కారు ప్రయాణిస్తుండగా తన జెసిబి బొమ్మను తిరిగి ఇస్తుండగా.. ఆ బాలుడు వద్దు గిఫ్ట్ గా ఉంచుకో అన్నట్టు సైగ చేసాడు. ఇలా రోడ్డు సిగ్నల్ వద్ద పిల్లలు ప్రేమ ఆప్యాయతలకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లల మనస్తత్వం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై కొందరు స్పందిస్తూ దేవుడి ఆశీర్వాదం వీరిపై ఎప్పుడు ఉండాలి అని కామెంట్ చేయగా మరికొందరు వీరి మధ్య అనుబంధం చూసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.






























