Vignesh Shivan: ప్రముఖ తమిళ హీరో అజిత్ గురించి తెలియని వారంటూ ఉండరు. కోలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలివుడ్ లో కూడా అజిత్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అజిత్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. దీంతో టాలివుడ్ లో కూడా అజిత్ కి మంచి మార్కెట్ ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల తునీవు సినిమా ద్వారా అజిత్ మంచి హిట్ అందుకున్నాడు.

ఆ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా అప్డేట్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అజిత్ నెక్ట్స్ సినిమా డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ఉండబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అయితే కొంత కాలానికి ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ ని తొలగించి అతని స్థానంలో మగిజ్ తిరుమేనిని దర్శకుడిగా నిర్మాతలు ఎంపికచేశారు . అంతే కాకుండా విఘ్నేష్ కూడా తన ట్విట్టర్ ఖాతా నుంచి ఈ సినిమాకు సంబంధించిన ట్వీట్ తొలగించాడు.
ఇలా చేయడంతో అజిత్ సినిమా నుండి విఘ్నేష్ ని తొలగించటం కోలీవుడ్ ఇండస్ట్రీలో చర్చంశనీయంగా మారింది. తాజాగా ఈ సినిమా నుండి తనని తొలగించటం గురించి విగ్నేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విగ్నేష్ ఈ సినిమా నుండి తనను తప్పించడానికి గల కారణాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ ఇంటర్వ్యూలో విగ్నేష్ మాట్లాడుతూ….

Vignesh Shivan: నిర్మాతలకు నచ్చలేదు…
” ఈ సినిమాకి నేను రాసిన స్క్రిప్ట్ అజిత్ కి బాగా నచ్చింది. కానీ స్టోరీలో సెకండ్ పార్ట్ నిర్మాతలకు నచ్చలేదు. అయితే ఈ స్టోరీ అజిత్ కి నచ్చినా కూడా నిర్మాతలకు నచ్చకపోవడంతో ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమా ఆగిపోవటానికి నిర్మాతలే కారణం అంటూ విష్నేష్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
































