Vijay Devarakonda: వామ్మో విజయ్ దేవరకొండ ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

0
98

Vijay Devarakonda: కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ నటుడిగా తన సత్తా ఏంటో చాటుకున్నటువంటి విజయ్ దేవరకొండ అనంతరం హీరోగా అవకాశాలు అందుకున్నారు. ఇలా హీరోగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి విజయ్ దేవరకొండ ఏకంగా పాన్ ఇండియా సినిమాల ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక ప్రస్తుతం ఈయన ఖుషి సినిమా షూటింగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా తర్వాత డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరో సినిమా చేయబోతున్నారు. విజయ్ దేవరకొండ మే 9వ తేదీ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడంతో ఈయనకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఆస్తుల గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.

విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారారు. అలాగే రౌడీ బ్రాండ్ అనే క్లోతింగ్ బిజినెస్ కూడా ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే.ఇలా విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో కొనసాగుతూ పలు వ్యాపార రంగాలలో కూడా స్థిరపడ్డారు. ఇక ఈయన ఒక్కో సినిమాకు దాదాపు 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు.

Vijay Devarakonda: కోట్లకు అధిపతి…


ఇలా ఒక్కో సినిమాకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విజయ్ దేవరకొండ భారీగానే ఆస్తులు కూడ పెట్టినట్లు తెలుస్తుంది. ఈయన పేరుపైన పెద్ద ఎత్తున ఆస్తిపాస్తులు మాత్రమే కాకుండా ఖరీదైన బంగ్లాలు కూడా ఉన్నాయని అలాగే ఈయన గ్యారేజ్ లో ఖరీదైన కార్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఒక నివేదికల ప్రకారం విజయ్ దేవరకొండ ఆస్తులు దాదాపు 70 నుంచి 80 కోట్ల వరకు ఉంటాయని సమాచారం.