Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నటువంటి మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా లైగర్. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ అనన్య పాండే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇకపోతే తాజాగా ఓ మీడియా సమావేశంలో భాగంగా విజయ్ దేవరకొండ టేబుల్ పై కాళ్లు పెట్టుకొని తన ఆటిట్యూడ్ చూపించిన విషయం మనకు తెలుసు.

ఇలా ఈయన టేబుల్ పై కాళ్లు పెట్టుకొని మీడియాతో ముచ్చటించాక చాలామంది ఆటిట్యూడ్ పై భారీగా ట్రోల్ చేశారు.ఈ మీడియా సమావేశంలో భాగంగా విలేకరి విజయ్ దేవరకొండను ప్రశ్నిస్తూ మీరు టాక్సీవాలా సినిమా చేసే సమయంలో చాలా ఫ్రీగా మాట్లాడాను అప్పుడు బాలీవుడ్ వెళ్తారా అంటే మీరు ఒక చిన్న నవ్వు నవ్వి ఊరికే ఉన్నారు.ఇప్పుడు నిజంగానే బాలీవుడ్ వెళ్లారు అంటూ విలేఖరి మాట్లాడారు.

ఇలా మీరు బాలీవుడ్ వెళ్ళగానే మీతో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నానని చెప్పడంతో రౌడీ హీరో మీరు ఫ్రీగా ఉండండి కాలుపై కాలు వేసుకుని కూర్చుని మాట్లాడండి నేను కూడా అలాగే మాట్లాడతాను అంటూ ఈయన టేబుల్ పై కాళ్ళు పెట్టి ఇద్దరు ఎంతో చిల్ అవుతూ మాట్లాడారు. ఇక అక్కడున్న వారి సైతం ఎంతో ఎంజాయ్ చేశారు.
Vijay Devarakonda: ఎదిగే క్రమంలోనే టార్గెట్ అవుతాము…
ఇలా అందరూ కలిసి సరదాగా మాట్లాడుకోగా కొందరు మాత్రం ఈ విషయంపై విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ ఆయనని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ విషయంపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ…ఎవరి రంగంలో వాళ్ళు ఎదగాలని ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలోని మరికొందరికి టార్గెట్ అవుతూ ఉంటారు. మనం వాటిపై పోరాటం చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నిజాయితీగాఉంటూ ప్రతి ఒక్కరి ప్రేమను కోరుకుంటాము అప్పుడే ఆ దేవుడి ఆశీస్సులు ప్రేమ మనపై ఉంటాయి అంటూ ఈ సందర్భంగా ఈయన ఈ వివాదంపై స్పందించే క్లారిటీ ఇచ్చారు.ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 25వ తేదీ విడుదల కానుంది మరి ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో తెలియాల్సి ఉంది.































