Vijay Devarakonda: నటుడు విజయ్ దేవరకొండ రష్మిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఫిబ్రవరి రెండో వారంలో వీరిద్దరు నిశ్చితార్థం చేసుకోబోతున్నారని ఈ ఏడాదిలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయని సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరు కలసి వెకేషన్ వెళ్లడం, అదేవిధంగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక ఫెస్టివల్ సెలబ్రేషన్స్ జరుపు కోవడం మనం చూస్తున్నాము. ఇలా తరచూ వీరి గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఈ విధంగా విజయ్ దేవరకొండ పెళ్లి గురించి ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వార్తలపై విజయ్ దేవరకొండ ఒక ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన క్లారిటీ ఇచ్చారు. ప్రతి ఏడాది నాకు మీడియా వల్లే పెళ్లి చేస్తున్నారు అంటూ ఈయన పరోక్షంగా పెళ్లి వార్తల గురించి క్లారిటీ ఇచ్చారు.
మీడియా వాళ్ళు పెళ్లి చేస్తున్నారు..
నేను ఫిబ్రవరి నెలలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నానని ఈ ఏడాదిలోనే పెళ్లి కూడా చేసుకుంటున్నాను అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. ఇలా పెళ్లి గురించి విజయ్ దేవరకొండ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.































