Vijayendra Prasad: ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం RRR. ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సమయంలోనే చిత్రబృందం పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. ఇకపోతే ఈ సినిమాకి రచయితగా వ్యవహరించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్రప్రసాద్ ఈ సినిమాలోని ఇంటర్వెల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకరి కోసం మరొకరు ప్రాణాలు ఇచ్చుకునేలా కనిపిస్తారు. అయితే సినిమా మొదట్లోనే వీరిద్దరూ ఒకరు దక్షిణ దృవం మరొకరు ఉత్తర దృవంలా వ్యవహరిస్తారు. వీరిద్దరికీ ఎక్కడో ఒకచోట క్లాష్ అవుతుందని అందరికీ అర్థమవుతుంది.
సింహాలు పోట్లాడుకుంటూ….
ఇలా వీరిద్దరి మధ్య క్లాష్ ఏర్పడిన తర్వాత వీరిద్దరూ రెండు సింహాల పోట్లాడుతూ ఉంటే చూడటానికి ఎంతో కను సొంపుగా ఉంటుంది. కానీ వీరిద్దరూ ఆ ఫైట్ చేయడం చూస్తే నాకు కన్నీళ్లు ఆగలేదు అంటూ విజయేంద్రప్రసాద్ తెలియజేశారు. ఇలా తాను ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా రష్ ఐదు సార్లు చూశానని ఇలా ఐదుసార్లు ఆ సన్నివేశం వచ్చినప్పుడు కన్నీళ్లు వచ్చాయని ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ తెలియజేస్తూ సినిమా పై మరింత ఆసక్తి కలిగేలా చేశారు.


























