Vijayendra Prasad: సాధారణంగా ఒక సినిమా విడుదల అవుతుంది అంటే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే సినిమా విడుదలకు ముందు ఫ్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించడం సినిమాకి మరింత హైప్ క్రియేట్ చేయడం చేస్తుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను నిన్న సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సినిమా ఈవెంట్లకు ఫ్రీ రిలీజ్ వేడుకలకు రావాలంటే చాలా అసహనం వేస్తుందని తెలిపారు.
సినిమా ఫ్లాప్ అవుతుందని వారి మొహాలలో స్పష్టంగా కనబడుతుంది.సినిమా ఆడదని తెలిసినా కూడా ఈ వేడుకకు హాజరై మొహమాటంగా సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందని అబద్ధాలు చెప్పాల్సి ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు.అయితే కార్తికేయ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా మాత్రం పక్కా హిట్ అవుతుందని ప్రొడ్యూసర్స్ రాసి పెట్టుకోమని ఈయన తెలిపారు.

Vijayendra Prasad: ఆడదని తెలిసిన అబద్ధం చెప్పాలి…
మనసా వాచా కర్మణా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పవచ్చు. ఈ సినిమా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంత వసూలు రాబడుతుందో నార్త్ ఇండస్ట్రీలో కూడా అంతే కలెక్షన్లను రాబడుతుందని ఈయన తెలిపారు.ఇందులో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ ఎంతో అద్భుతంగా నటించారని విజయేంద్ర ప్రసాద్ వారిపై ప్రశంసలు కురిపించారు. మొత్తానికి ఈ సినిమా వేడుకలో భాగంగా విజయేంద్ర ప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.






























