New Year celebrations: అష్టాచమ్మ కేకుతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న గ్రామస్తులు.. ఎక్కడంటే?

0
431

New Year celebrations: నూతన సంవత్సరం రావడంతో ప్రతి ఒక్కరు విభిన్న రీతులలో పార్టీలు చేసుకుంటూ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ వివిధ రకాల కేకులు తయారు చేయించే కేక్ కట్ చేస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.కానీ అనంతపురం జిల్లాలోని రెడ్డిపల్లి గ్రామంలో ప్రజలు మాత్రం వినూత్న పద్ధతిలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ప్రస్తుతం వీరి నూతన సంవత్సర వేడుకలకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

New Year celebrations: అష్టాచమ్మ కేకుతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న గ్రామస్తులు.. ఎక్కడంటే?
New Year celebrations: అష్టాచమ్మ కేకుతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న గ్రామస్తులు.. ఎక్కడంటే?

పూర్వకాలంలో మన పెద్దలు మానసిక ఉల్లాసం కోసం వివిధ రకాల ఆటలు ఆడేవారు. అలాంటి వాటిలో అష్టాచమ్మా (బారాకట్ట) ఆట ఒకటి. ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోవడం వల్ల చాలామంది ఈ విధమైనటువంటి ఆటలు మరిచిపోయారు.ప్రస్తుత కాలం యువతి యువకులకు చిన్న పిల్లలకు ఈ ఆట ఏ విధంగా ఆడాలో కూడా తెలియడం లేదు.

New Year celebrations: అష్టాచమ్మ కేకుతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న గ్రామస్తులు.. ఎక్కడంటే?
New Year celebrations: అష్టాచమ్మ కేకుతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న గ్రామస్తులు.. ఎక్కడంటే?

గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ ఈ విధమైనటువంటి ఆటలకు అక్కడక్కడ ఆదరణ లభిస్తోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలోని రెడ్డి పల్లి గ్రామంలో పెద్దమ్మ వీధిలో కొందరు పెద్దలు, యువత ఇప్పటికీ ఈ ఆటను ఆడుతూ ఎంతో మానసిక ఆనందాన్ని పొందుతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు సాయంత్రం సరదాగా ఈ ఆట ఆడుతూ ఎంతో సంతోషంగా ఉండే ఈ గ్రామస్తులు నూతన సంవత్సరాన్ని విన్నూత్న పద్ధతిలో జరుపుకున్నారు.

బారకట్ట అడ్డాగా మారిన పెద్దమ్మ వీధి:

ప్రతిరోజు సాయంత్రం ఈ వీధిలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున ఈ ఆట ఆడుతూ ఎంతో ఆనందంగా గడిపేవారు. ఇలా రెడ్డిపల్లిలోని పెద్దమ్మ వీధి బారకట్ట అడ్డాగా మారిపోయింది. ఇక నూతన సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం ఇక్కడ కొందరు యువత ఏకంగా అష్టాచెమ్మ తో కేక్ తయారు చేయించి వారి ప్రతిరోజు ఈ ఆట ఆడే చోట ఈ కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ప్రస్తుతం ఈ కేక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.