వర్క్‌ ఫ్రం హోమ్‌ కావాలి.. ఆఫీసులు వద్దు?

0
309

గత ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రరూపం దాల్చడంతో వివిధ రకాల ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రొం హోమ్ ని సూచించాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఉద్యోగులు సైతం ఆఫీసులో వద్దు ఇంటి నుంచి పని చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ విధంగా ఇంటి నుంచి పనిచేస్తూ జూమ్ మీటింగ్స్, కాల్స్ అన్ని కూడా ఇంటి నుంచే కానిచ్చేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న ఈ విధమైనటువంటి పరిస్థితులలో ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఓ ఫన్నీ వీడియోను ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే హర్ష్ గోయెంకా ప్రస్తుతం ఉద్యోగులు ఆఫీసుకు వెళ్లి పని చేయడానికి ఎందుకు ఇష్టం చూపడం లేదో తెలియజేశారు.

ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్‌గా పనిచేస్తున్న హర్ష్ గోయెంకా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ నెటిజన్లకు పలు సూచనలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ విధులు నిర్వర్తించే ఉద్యోగులను “ప్రజలు ఆఫీసుకు ఎందుకు వెళ్ళకూడదనీ నేను అడిగాను”అనే క్యాప్షన్ తో ఈ పోస్ట్ షేర్ చేయడంతో దీనికి ఉద్యోగులు చెప్పిన ఫన్నీ సమాధానాలను చార్ట్ రూపంలో వివరించారు.

కొందరు ఉద్యోగులు ట్రాఫిక్ లో సమయం ఎందుకు వృధా చేసుకోవాలి అని చెప్పగా, మరికొందరు నా కుటుంబంతో గడపడం ఎంతో ఇష్టంగా ఉంది. నేను ఇంట్లోనే ఎక్కువ పని కలిగి ఉన్నాను. నా తోటి ఉద్యోగులను కలవకపోవడం నాకు సంతోషంగా ఉంది. మరికొందరు ఎక్కువ సేపు పూర్తి ప్యాంటు ధరించాల్సి ఉంటుంది అనే సమాధానాలను చెప్పారు.

ఈ సమాధానాలలో ఎక్కువగా నేను పూర్తి ప్యాంటు ధరించాల్సి ఉంటుంది అనే సమాధానం చాలామంది తెలియజేశారు. మరికొందరు నా షూస్, సాక్సులు ఎక్కడున్నాయో తెలియదు. మరికొందరు నా బట్టలు ప్రస్తుతం నాకు సెట్ అవుతాయనే నమ్మకం లేదంటూ ఫన్నీ సమాధానాలను తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఫన్నీ సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.