ఏంటి టర్కీ వీధుల్లో గొర్రెలా? అదెలా అని మీకు సందేహం రావచ్చు.. కానీ నిజంగానే గొర్రెలు టర్కీ వీధుల్లో తిరుగుతున్నాయ్. మీకు ఆశ్చర్యం వేసిన ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న అంశం ఇది. ఎప్పుడైనా మనం హైవేపై ప్రయాణం చేస్తున్న సమయంలో కొన్ని గ్రామాల వద్ద రోడ్లపై గొర్రెల గుంపు పోతుంటుంది. అది మనం చూస్తూనే ఉంటాం. కానీ అదే నగరాల్లో అయినా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో రోడ్లపై గొర్రెలను, మేకలను మనం ఎప్పుడు చూసి ఉండం.

అలాంటిది టర్కీ విధుల్లో గొర్రెలు తిరగడమే కాదు మనుషులపై దాడులు కూడా చేశాయి. ఎవరైనా తరమాలని చూస్తే వారిని పరుగులు పెట్టించాయి. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఏం జరిగిందో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యానికి గురవుతారు. అలాంటి ఘటన ఆ వీడియోల్లో జరిగింది.

ఎంతో ప్రశాంతంగా ప్రజలంతా తమ పనులతో బిజీ బిజీగా గడుపుతున్న సమయంలో ఎవరు ఊహించని విధంగా ఉన్నట్టుండి ఒక రోడ్డు మీదకు వచ్చింది. అది మరేదో కాదు గొర్రెల గుంపు. సిటీ లైఫ్ కి అలవాటు పడ్డ ప్రజలు గొర్రెలను చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన టర్కీలోని నెవ్ షేహిర్ ప్రాంతంలో గొర్రెల గుంపు రోడ్డుపైకి వచ్చి హల్ చల్ చేసింది. ఎదురుపడిన మనుషులను పొడవడం ప్రారంబించాయ్. సుమారు ఒక అరగంట పాటు ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు గానీ రోడ్డుపై అటుగా వెళ్ళే పాదచారులను పరుగులు పెట్టించాయి. అంతేకాకుండా వాటిని ఆపుదామని వెళ్ళిన కొంతమందిని భౌతికంగా గాయపరిచాయి. ఈ సంఘటన చోటు చేసుకొని మూడు రోజులు అవ్వగా ఈ ఘటనను నెవ్ షేహిర్ ప్రాంత మున్సిపాలిటీ అధికారులు వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here