Virata Pravam : నీది నాది ఒకే కథ సినిమా తీసిన వేణు ఉడుగుల దర్శకత్వంలో నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా విరాట పర్వం. రానా దగ్గుబాటి, సాయి పల్లవి ముఖ్య పాత్రాలలో నటించిన ఈ సినిమా జూన్ 17 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా కారణంగా అనేక వాయిదాలు పడిన ఈ సినిమాను తోలుత ఓటీటీ లో విడుదల చేస్తారని అనుకున్న చివరికి థియేటర్స్ లో విడుదల చేసారు. తూము సరళ అనే ఒక నక్సలైట్ నిజం జీవితంలో జరిగిన కథ ఆధారంగా తీసిన చిత్రం కావడంతో మరింత ఇంట్రెస్ట్ సినిమా మీద కలిగింది. మరి సినిమా ఎలా ఉందొ తెలుసుకుందామా….

కథంతా వెన్నెల చుట్టూనే….
సాయి పల్లవి మెయిన్ లీడ్ గా నటించిన ఈసినిమాలో కథ మొత్తం వెన్నెల అనే అమ్మాయి ప్రేమ కథగా చెప్పొచ్చు. పోరాటాల నడుమ పుట్టిన చిన్నారి సాయి పల్లవి, వెన్నెల (సరళ పేరును మార్చారు ) ప్రేమ కథ ఈ సినిమా. నక్సలైట్లకు, పోలీసులకు మధ్య కాల్పుల సమయంలో తల్లి ఈశ్వరి రావు కి పుడుతుంది ఇక సాయి పల్లవికి వెన్నెల అని పేరు పెట్టేది కూడా ఒక మహిళ నక్సలైట్ (నీవేదా పితురాజ్ ). పెరిగి పెద్దయ్యాక వెన్నెల నక్సలైట్ అరణ్య అలియాస్ రవన్న పుస్తకాలు చదివి అతన్ని చూడకుండానే ప్రేమలో పడుతుంది. రవన్న ( రానా దగ్గుబాటి ) దళ సభ్యుడు. ఈ విషయంలో తెలియని వెన్నెల తల్లిదండ్రులు ఈశ్వరిరావు, సాయి చందర్ మేన బావ రాహుల్ రామకృష్ణ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. ఇక వెన్నెల రవన్న ను ఇష్టపడుతున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి రవన్న కోసం ఇంటికి నుండి వెళ్ళిపోతుంది. ఇక తాను రవన్నను ఎలా చేరింది, తన ప్రేమను చెప్పి కన్విన్స్ చేసింది అనేది కథాంశం. నక్సలిజం భావాలున్న రవన్న వెన్నెల ప్రేమను అంగీకరించాడా లేదా అన్నదే సినిమా.

తుపాకీ గొట్టంలో శాంతి లేదు… అమ్మాయి ప్రేమలో ఉంది….
1990- 92 నేపథ్యంలో తెలంగాణ లో సాగే ఈ కథలో వేణు ఉడుగుల తెలంగాణ పల్లె వాతావరణం అప్పట్లో ఎలా ఉండేదో చక్కగా చూపించారు. వేణు ఉడుగుల సొంతంగా డైలాగులు రాసుకోవడం వల్ల కొన్ని డైలాగులు సినిమాలో బాగా పేలాయి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. మా ఊళ్ళల్లో ఆడవాళ్లపై అత్యాచారాలు, మానభంగాలు, అన్యాయాలు జరిగినపుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చారు సార్.. అన్నలు వచ్చారు… నోరు లేని సమాజానికి నోరు అందించారు అని సాగే డైలాగు ఆకట్టుకుంది. ఇక దళ నాయకుడిగా రానా నటన ఆకట్టుకుంటుంది. ఇక కథకు మూలమైన వెన్నెల పాత్రధారి సాయి పల్లవి నటన చూపు తిప్పనివ్వదు. ఎంత మంది ఉన్న కళ్ళతోనే హావభావలను పలికించి సాయి పల్లవి ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఇక దళ సభ్యులుగా నటించిన ప్రియమణి (భారతక్క) నవీన్ చంద్ర ( రఘన్న) గాను ప్రొఫెసర్ శకుంతల గా నందిత దాస్ నటన బాగుంది. ఫస్ట్ హాఫ్ లో వెన్నెల రవన్న దళాన్ని పోలీసులనుండి తప్పించడానికి చేసే సాహసం గుస్ బంప్స్ తెప్పిస్తుంది. సెకండ్ హాఫ్ లో రవన్న తనతల్లిని కలవడానికి వెళ్ళినపుడు పోలీసులతో యాక్షన్ సన్నివేశం అదిరిపోయింది. ఇక చివర్లో వెన్నెల చనిపోవడం ప్రేక్షకులను కంటతడి పెట్టించి థియేటర్ నుండి బయటికీ రప్పించింది . ఇక సినిమాలో ప్రధాన బలం సంగీతం సురేష్ బొబ్బిలి అందించిన పాటలు కథతో పాటు సాగేవిగా ఉండటంతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. నేపథ్యం సంగీతము బాగుంది. ఇక ఎమోషనల్ సన్నివేశాలు ఎంత కన్నీరు పెట్టించాయో యాక్షన్ సన్నివేశాలు అంతలా ఆకట్టుకున్నాయి. దర్శకుడు కథను ఎక్కడ కమర్షియల్ వాసన రానివ్వకుండా కథను ఎలా చెప్పాలనుకున్నాడో అలానే చెప్పాడు.

తెలంగాణ పల్లె అందాలు, అడవుల సౌందర్యాన్ని చక్కగా చూపించారు. దివాకర్ మణి, డానీ సాంచేజ్ లోపేజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఓకే అనేలా ఉంది. ఓవరాల్ గా నక్సలిజం నేపథ్యంలో తెలుగులో చాలా కథలే వచ్చిన ఇదొక కొత్త ప్రయత్నమనే చెప్పాలి. కథ పరంగా ఇంకా యాక్షన్ సన్నివేశాలకు స్కోప్ ఉన్నా దర్శకుడు ఎక్కువ ఫోకస్ చేయలేదనిపిస్తుంది. ఇక సినిమాలో ఎందుకు వెన్నెల రవన్న ప్రేమలో పడిందో బలమైన కారణం చెప్పలేదు. ఒక మీరాబాయి కృష్ణుడు కోసం ఎలా చేసిందో అలా వెన్నల రవన్న కోసం ఇంటినుండి వెళ్ళిపోయి కష్టాలు పడిందని దర్శకుడు పోల్చి చెప్పే ప్రయత్నం చేసాడు. మొత్తానికి సినిమా కమర్షియల్ కథ కోరుకునే వారికి నచ్చక పోవచ్చు అయితే ఒక ఫీల్ గుడ్ మూవీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.