Virupaksha: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత సాయి ధరమ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు విరూపాక్ష సినిమా ద్వారా వచ్చారు.

గత రెండు సంవత్సరాల క్రితం ఈయన తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ప్రమాదం నుంచి కోలుకొని తిరిగి విరూపాక్ష సినిమాలో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా సాయి ధరమ్ తేజ్ నటించడానికి కాస్త ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. ఇదే విషయాలను పలువురు ప్రమోషన్ కార్యక్రమాలలో తెలియజేశారు. ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ సినిమాని పూర్తి చేశారు.
ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సాయిధరమ్ తేజ్ రెస్ట్ తీసుకొని ఇంట్లో ఉండకుండా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను తన భుజాలపై వేసుకొని వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ భారీ స్థాయిలో ఈ సినిమాని ప్రమోట్ చేశారు. ఇక ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రావడంతో చిత్ర బృందం సైతం ప్రేక్షకులతో కలిసి థియేటర్లో ఈ సినిమాని వీక్షించారు. అయితే థియేటర్లో సినిమాకి వస్తున్న ఆదరణ చూసి సాయి ధరమ్ తేజ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

Virupaksha: రెండేళ్ల నరకానికి సరైన ఫలితం…
ఈ క్రమంలోనే షో పూర్తయిన తర్వాత బయటికి వచ్చిన అనంతరం ఈయన దర్శకుడు కార్తీక్ ను కౌగిలించుకొని ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెండేళ్ల పాటు అనుభవించిన నరకానికి సరైన ఫలితం దక్కిందని పలువురు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.ఇక పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా మంచి కలెక్షన్లను కూడా రాబడితే ఈ సినిమా సూపర్ సక్సెస్ అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు
Supreme Hero @IamSaiDharamTej & Director @karthikdandu86‘s emotional moment celebrating the Blockbuster Response of #Virupaksha ????❤️
Don’t miss the Spine-Chilling #BlockbusterVirupaksha in theatres ????https://t.co/HzG8SAAGh7@iamsamyuktha_ @SVCCofficial @SukumarWritings pic.twitter.com/7rnhKc0HRH
— SVCC (@SVCCofficial) April 21, 2023
































