Vishnu Priya: పోవే పోరా షో ద్వారా యాంకర్ గా ఫేమస్ అయిన విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పోవే పోరా షోలో సుధీర్ తో కలిసి సందడి చేసిన విష్ణు ప్రియ బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత యాంకర్ గా అవకాశాలు అందుకోలేకపోయినా కూడా పలు టీవీ షోలో సందడి చేసింది. అంతే కాకుండా అడపా దడపా సినిమాలలో కూడా నటిస్తోంది.

ఇటీవల బుల్లితెర నటుడు మానస్ తో కలిసి ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ చేసిన జరీ జరీ పంచకట్టు అనే ఆల్బమ్ సాంగ్ బాగా వైరల్ అయ్యింది. ఇక తాజాగా గంగుల అనే ఆల్బమ్ సాంగ్ కూడా చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణుప్రియ తన హాట్ ఫోటోలతో అందరికీ పిచ్చెక్కిస్తోంది. మొదట ట్రెడిషనల్ లుక్ లో కనిపించే విష్ణు ప్రియ రాను రాను అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచింది.
కొన్ని సందర్భాలలో సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే గ్లామర్ షో కి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇలా బోల్డ్ గా కనిపించే విష్ణు ప్రియ జీవితంలో కూడా కన్నీటి గాధ ఉంది. గతంలో ఆమె ఎన్నో తిండి లేని రోజులు కూడా గడిపినట్లు తాజగా విష్ణు ప్రియ వెల్లడించింది. తాజగా మై విలేజ్ షో వారితో కలిసి విష్ణు ప్రియ, మానస్ దావత్ చేసుకున్నారు. చాలా ఫన్నీగా మొదలైన ఈ దావత్ లో చివరికి విష్ణు ప్రియ తన జీవితంలో ఉన్న కష్టాల గురించి చెబుతు కన్నీళ్లు పెట్టుకుంది.

Vishnu Priya: ప్రస్తుతం అమ్మ లేదు…
ఈ క్రమంలో విష్ణు ప్రియ మాట్లాడుతూ.. తనకు మూడేళ్ల సమయంలో ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అయినట్లు తెలిపింది. 2015లో ఇండస్ట్రీలో రాగా పోవే పోరా, నంబర్ వన్ యారీ ఒకే టైంలో ఆఫర్స్ వచ్చాయని తెలిపింది. నంబర్ వన్ యారీ సమయంలో ఆమె చాలా సన్నగా కనిపించడం వెనుక కారణాలను చెబుతూ..అప్పట్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తినడానికి సరిగా తిండి లేకపోవటంతో అలా ఉన్నానని తాను పడ్డ కష్టాలను బయట పెట్టింది.ఇక తాను ఒక స్టార్ అయి తన తల్లికి మంచి పేరు తీసుకురావాలని భావించాను అయితే ఇప్పుడు తన తల్లి ఈ లోకంలో లేదు అంటూ విష్ణు ప్రియ తన అమ్మను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.
































