Vishnu Priya -Manas: టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శేఖర్ మాస్టర్ గురించి పరిచయం అవసరం లేదు.ఈయన ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరికీ అద్భుతమైన స్టెప్పులు వేయించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ విధంగా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి శేఖర్ మాస్టర్ ప్రవేట్ సాంగ్స్ కి కూడా కొరియోగ్రఫీ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే యాంకర్ విష్ణు ప్రియ, మానస్ జంటగా జరీ జరీ పంచె కట్టి అనే పాటకు అద్భుతమైన కంపోస్ట్ చేశారు.ఇక వీరితో శేఖర్ మాస్టర్ తన సిగ్నేచర్ స్టెప్స్ చేయిస్తూ సూపర్ కొరియోగ్రఫీ చేశారని చెప్పాలి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ పెద్ద ఎత్తున వ్యూస్ సంపాదించుకుంది.
యాంకర్ గా విష్ణు ప్రియ ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నారో మనకు తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తోఅందరిని సందడి చేసేది అయితే ఈ పాటలో విష్ణు ప్రియ చేసిన డాన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

Vishnu Priya -Manas: ఆకట్టుకుంటున్న వీడియో సాంగ్..
తాజాగా ఈమె హీరోయిన్ గా నటించిన వాంటెడ్ పండుగాడ్ సినిమా విడుదలైనప్పటికీ ఈ సినిమా పెద్దగా సందడి చేయలేదని చెప్పాలి. ఇక మానస్ కూడా ఎంత మంచి డాన్సరో మనకు బిగ్ బాస్ కార్యక్రమంలోనే తెలిసిపోయింది. బిగ్ బాస్ కార్యక్రమంలో తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ జంటగా నటించిన ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ అద్భుతమైన వీడియో సాంగ్ పై మీరు ఓ లుక్ వేయండి.































