దసరా తర్వాత నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. దీనిని గవర్నర్ దత్తాత్రేయ నేతృత్వంలో మొదట జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సినీ, ప్రజాసంఘాల ప్రముఖులు పాల్గొన్నారు. దీనిలో తాజాగా మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అయితే వేదికపై వీరిద్దరూ పరస్పరం పలకరించుకోక పోవడం చర్చనీయంశమైయింది. దీనిపై సీని వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనిపై మంచు విష్ణు స్పందించారు. ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అంశంపై స్పందించాడు . అలయ్ బలయ్ కార్యక్రమంలో స్టేజ్ పైకి రాకముందే పవన్ కళ్యాణ్ తో తాను మాట్టాడాను అని.. మేమిద్దం చాలా విషయాలపై చర్చించుకున్నట్లు తెలిపాడు. ప్రోటోకాల్ ప్రకారం మేమిద్దరం స్టేజ్‌పై మాట్లాడుకోలేదు. స్టేజ్ మీద ఏం జరిగిందో అది మాత్రమే మీడియాకి తెలిసింది. పవన్ పెద్ద స్టార్ అని.. అతడి సహకారం ‘మా’ కు అవసరం అని పేర్కొన్నాడు. నేను, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులం.
ఆ కార్యక్రమంలో మేము మాట్లాడుకున్నాము అంటే మీరు ఎందుకు నమ్మరు? మాకు, మెగా ఫ్యామిలీకి మధ్య ఎప్పటికీ గోడవలు ఉండవంటూ విష్ణు కామెంట్స్ చేయడం విశేషం. ఇక మా లో మూకుమ్మడి రాజీనామాలపై అతడు మాట్లాడుతూ.. వాళ్లు రాజీనామాలు చేసినట్లు మీడియా ద్వారానే నాకు తెలుసు.. కానీ నాకు ఒక్కరి నుంచి మాత్రమే రాజీనామా అందిందని చెప్పాడు. మిగిలిన వాళ్ల నుంచి కూడా వచ్చాక.. మేము ఒక్కసారి చర్చించుకుని.. సినీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశాడు.




























