Viswak Sen : కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరోసారి కొత్త వేరియంట్ రూపంలో తన పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు కమల్ హాసన్, కరీనా కపూర్, అర్జున్ వడివేలు వంటివారు ఈ మహమ్మారి బారిన పడి సురక్షితంగా కోలుకున్నారు. మరోవైపు టాలీవుడ్ లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్న మంచు మనోజ్ కరోనా బారిన పడగా.. తాజాగా మరొక యంగ్ హీరో కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది.

తాజాగా హీరో విశ్వక్ సేన్ కరోనా బారిన పడినట్లు ఆయన ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ప్రసుతం నేను హోం ఐసోలేషణ్ లో వున్నాను. గత కొద్దిరోజులుగా తనను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరు మాస్క్ లు వేసుకుని తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మనోజ్ తనను కలిసిన వారికి తెలిపారు.

































