వివేకా హత్య కేసు.. గొడ్డలితో చేయి నరికి.. చాతిపై కొట్టి.. వాంగ్మూలంలో కీలక విషయాలు..!

0
477

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఇవి హాట్ టాపిక్ గా మారాయి. అతడి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్రూవర్‌గా మారిన నిందితుల్లో ఒకరైన వివేకా కారు డ్రైవర్ షేక్ దస్తగిరి.. వాంగ్మూలంలో కీలక విషయాలను వెల్లడించారు.

ప్రొద్దుటూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఆగస్టు 25న ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి రాగా.. అందులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకు ఆర్ధిక లావాదేవీలే కారణమని దస్తగిరి పేర్కొన్నారు. వివేకానంద రెడ్డిని చంపితే రూ. 40 కోట్లు ఇస్తారని.. అందులో రూ.5 కోట్ల వరకు నీకు ఇస్లానని వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పినట్టు దస్తగిరి తెలిపారు. ఈ హత్య కేసులో హత్య సమయంలో సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డిలు కూడా ఉన్నారని అతడు చెప్పాడు.

గంగిరెడ్డి ఇంట్లోనే ఈ హత్య పథకం వేశారని వివరించాడు. డ్రైవర్ గా నీకు వచ్చే డబ్బులు చాలా తక్కువ.. నేను చెప్పింది చేయ్ అంటూ గంగిరెడ్డి దస్తగిరికి చెప్పినట్లు చెప్పాడు. దానిలో భాగంగానే ఈ హత్యకు సంబంధించి తనకు రూ. కోటి అడ్వాన్స్ ఇచ్చినట్లు చెప్పాడు. సునీల్ ఆదేశాలతో హ్యతకు గొడ్డలి తెచ్చానని.. గంగిరెడ్డి ఇంటికి వెళ్లామని తెలిపారు. అక్కడే ఉన్న వివేకా.. మమ్మల్ని చూసి మీరెందుకు వచ్చారు అని కోపం తెచ్చుకున్నట్లు సమాధానమిచ్చాడు. అక్కడే గంగిరెడ్డికి, వివేకాకు సెటిల్ మెంట్ విషయంలో గొడవ జరిగింది.

అక్కడే ఉన్న సునీల్ వివేకాను అసభ్యకరంగా తిడుతూ ముఖంపై కొట్టాడని చెప్పాడు. ఆయన వెనక్కిపడిపోయారు. దాంతో ఉమాశంకర్‌రెడ్డి నా దగ్గరున్న గొడ్డలి తీసుకుని వివేకా తలపై కొట్టడంతో రక్తమోడుతూ పడిపోయారు. ఆ తర్వాత వెంటనే సునీల్ అతడి ఛాతిపై బలంగా కొట్టాడు.. ఇక సెటిల్ మెంట్ కు సంబంధించి డాక్యూమెంట్ల కోసం తిరుగుతుండగా.. వివేకా గట్టిగా అరిచాడని.. వెంటనే నేను అతడి చేయిపై గొడ్డలితో కొట్టాను అంటూ అతడు వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here