Waltair Veerayya: వాల్తేరు వీరయ్యతో అభిమానులకు మాస్ మసాలా ఎంటర్టైనర్ అందించిన చిరు!

0
56

Waltair Veerayya: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతూ నేడు చిత్ర పరిశ్రమకే ఎంతో గర్వకారణమైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. మెగాస్టార్ అనే బిరుదును సంపాదించుకున్న ఈయనకు ఈ బిరుదు ఆషామాషీగా రాలేదు. ఈ బిరుదు వెనుక ఎంతో కష్టం కృషి ఉన్నాయని చెప్పాలి.

ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా మారిన చిరంజీవి ఎప్పటికప్పుడు నటనలో మార్పులు చేసుకుంటూ ప్రేక్షకులకు కావలసినటువంటి వినోదాన్ని అందించారు.ఇలా నటుడిగా ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకొని మెలుగుతున్నటువంటి చిరంజీవి అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్నారు. చిరంజీవి సినిమా వస్తుందంటే ఇక థియేటర్ మొత్తం దద్దరిల్లి పోవాల్సిందే.

ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆగ్ర హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందిన ఈయన రాజకీయాలలోకి వెళ్లారు. ఇక రాజకీయాలలో కొత్త కాలం పాటు ఉన్నటువంటి చిరంజీవి తిరిగి ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.అనంతరం సైరా నరసింహారెడ్డి ఆచార్య గాడ్ ఫాదర్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలలో చిరంజీవి తన మార్క్ కనిపించిన ప్రేక్షకులలో ఎక్కడో చిన్న డిసప్పాయింట్మెంట్ అనేది ఉంది.

Waltair Veerayya: వాల్తేరు వీరయ్యతో సంక్రాంతి ట్రీట్ ఇచ్చిన చిరు…

ఇక ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు ముందుకు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా వచ్చారు. అయితే ఈ సినిమాలో మాత్రం ప్రేక్షకులకు కావలసినటువంటి ఫుల్ మాస్ మసాలా ఎంటర్టైనర్ అందించారనే చెప్పాలి.ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో దృష్టిలో ఉంచుకున్నటువంటి డైరెక్టర్ ప్రేక్షకులకు కావలసినది వారి ముందుకు తీసుకువచ్చారు.గత సినిమాలలో చిరంజీవి మాస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉండేదో అదే విధంగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకులకు చూపించడంతో ప్రేక్షకులు మాత్రం బాస్ ఇస్ బ్యాక్ అంటూ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈయన దాదాపు 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇప్పటికి అదే క్రేజ్ సొంతం చేసుకున్నారని చెప్పాలి.