ప్రస్తుతం కరోనా కారణం వల్ల చాలామంది ఇంటికే పరిమితం కావడం వల్ల ఎక్కువ సమయం టీవీల ముందు గడుపుతున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఎక్కువ సమయం పాటు టీవీ చూడటం వల్ల సమస్యలు బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు నాలుగు గంటలకు మించి టీవీ చూస్తే మీలో గురక వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అధ్యయనంలో భాగంగా 10 నుంచి 18 సంవత్సరాల
1,38,000 మంది పిల్లల పై పరిశోధనలు జరిపారు. ఈ అధ్యయనంలో భాగంగా పిల్లలు ఎక్కువసేపు టీవీ చూస్తూ కూర్చోవడం వల్ల వారిలో స్లీప్ అప్నియాకు దారితీస్తుందని తెలిపారు.
ఈ కారణం వారిలో గురక వ్యాప్తి చెందడానికి కారణమవుతుందని నిపుణులు తెలిపారు. గురక అనేది రాత్రి పడుకున్న సమయంలో వాయు మార్గాలలో ఒక నాళాన్ని పూర్తిగా మూసి వేయడం వల్ల శ్వాస తీసుకోవడానికి మనకు ఇబ్బంది కలుగుతుంది. ఈ సమయంలోనే గురక అనేది వస్తుంది.అయితే గురక ఎక్కువగా వచ్చే వారు తప్పనిసరిగా వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. లేకపోతే క్యాన్సర్, గుండెపోటు, గ్లాకోమా, రక్తపోటు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
ఈ క్రమంలోనే ప్రతిరోజు టీవీ నాలుగు గంటల కంటే మించి చూడకూడదని, ప్రతిరోజు మన శరీరానికి 30 నిమిషాల పాటు వ్యాయామం ఎంతో అవసరమని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా టీవీ చూసేటప్పుడు చాలామంది రకరకాల చక్కెర పానీయాలు, స్నాక్స్ తింటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అధిక శరీర బరువు పెరగడం కాకుండా,అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.




























