Jeevitha Rajashekar: సినీ నటులు జీవిత రాజశేఖర్ దంపతులు గరుడవేగ సినిమా నిర్మాణంలో భాగంగా తమ దగ్గర నుంచి 26 కోట్ల రూపాయలను తీసుకొని తిరిగి ఇవ్వలేదంటూ నగరి కోర్టులో జీవిత రాజశేఖర్ పై జోస్టర్ ఫిలిం సర్వీసెస్ సభ్యులు ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే నగరి కోర్టు జీవిత రాజశేఖర్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

ఇక నిన్నటి నుంచి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయంపై జీవిత-రాజశేఖర్ స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో భాగంగా జీవితం మాట్లాడుతూ మేము ఎలాంటి తప్పు చేయలేదని మాపై వచ్చే ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని వెల్లడించారు.

కోర్టు తీర్పు తర్వాత సాక్షాలతో సహా అన్ని విషయాలు బయట పెడతాను. మా పై ఆరోపణలు చేసిన వారు చాలా తప్పు చేశారు. నేను ఎన్నో మంచి పనులు చేసిన చాలా మందికి నచ్చదు అయితే. జీవితంలో మంచి చెడు అనేవి స్నేహంగా ఉంటాయి. అయితే మనిషిని చూసి మంచి చెడు అని నిర్ణయించలేమని జీవిత వెల్లడించారు.
విషయం తెలియకుండా మాట్లాడకండి…
ఇక చెక్ బౌన్స్ విషయంలో నేను తప్పు చేసి ఉంటే ఎప్పడో ఇండస్ట్రీ నుంచి వెళ్లి పోయేదాన్ని. కానీ నేను మీ అందరి ముందే మీ మధ్యనే తిరుగుతున్నాను.మీ అందరిని నేను ఒకటే వేడుకుంటున్నాను అసలు విషయం ఏంటో తెలియకుండా మీ ఇష్టానుసారంగా మీకు నచ్చిన థంబ్ నైల్ పెట్టేయకండి. మేము దుర్మార్గులము అయితే గత 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగలేము.అలాగే పోలీసులు కోర్టులు కూడా చూస్తూ ఊరుకోరు అంటూ జీవిత రాజశేఖర్ తన గురించి వచ్చిన ఆరోపణలపై ఘాటుగా విమర్శించారు. కోర్టు ప్రోటోకాల్ ప్రకారం ఈ విషయం గురించి ఇంతకన్నా ఏమీ మాట్లాడలేననీ జీవితం తెలిపారు.