ప్రస్తుత సమాజంలో చాలా మందిని పట్టి పీడిస్తున్న సమస్య బరువు తగ్గడం.ఈ తగ్గడం కోసం చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. డాక్టర్ ను సంప్రదించి వారు చెప్పిన విధంగా పాటించడం, ఇంటి చిట్కాలు పాటించడం ఇలా బరువు తగ్గడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా చేసినప్పటికీ కొంతమందిలో మార్పు వచ్చింది మరికొంతమందికీ ఏ మార్పు రావడం లేదు. లావు తగ్గడం కోసం మనం ఎన్నోరకాల డేటింగ్ లు కూడా చేస్తుంటాం.

కొంతమంది అయితే ఈ బరువు తగ్గడం కోసం అని తిండితిప్పలు మానేస్తు ఉంటారు. వచ్చింది మానేస్తే బరువు తగ్గడం ఈ సంగతి పక్కన పెడితే ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇక ఇది ఇలా ఉంటే జనరల్ గా డైలీ ఎక్కువగా రైస్ ఐటమ్ తీసుకోవడం మంచిది కాదు అని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా మూడుపూటలా రైస్ తీసుకోకుండా, ఒక పూట చపాతీ,ముద్ద చేసుకోమని చెబుతూ ఉంటారు.
ఇక అమెరికా జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ వెలువరించిన పరిశోధనలో మనం తినే బియ్యం లలో అటువంటి బియ్యం తింటే కచ్చితంగా బరువు తగ్గుతారని తేలిందట. మరి ఆ బియ్యం ఏమిటో కాదు బ్రౌన్ రైస్. ఈ బ్రౌన్ రైస్ ను తింటే బరువు తగ్గుతారని పరిశోధనలలో తేలింది. బ్రౌన్ రైస్ అంటే పేరుకు తగ్గట్టుగానే అవి గోధుమ రంగు లోనే ఉంటాయి. మనం డైలీ వాడే బియ్యం మాత్రం తెల్లగా ఉంటాయి.
అయితే బియ్యాన్ని తెల్లగా రిఫైండ్ చేయడం కోసం పాలిష్ ప్రక్రియను ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలోనే బియ్యం ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని గుణాలను కోల్పోతాయి. పాలిష్ చేయని బ్రౌన్ రైస్ లో షుగర్ పాళ్లు తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. దీనివల్ల ఈ బ్రౌన్ రైస్ ని తినేవాళ్లకు ఎక్కువ కేలరీలు బాడీలో చేరవు. దీంతో వారు ఈజీ గా బరువు తగ్గుతారు.