వయస్సు పెరుగుతున్నా కొద్ది ఆరోగ్యం క్షీణించడం అనేది సహజం. ఎవరైనా దాదాపు 40 ఏళ్ల వరకు ఎలాంటి జబ్బులు లేకుండా ఉంటారు. 40 నుంచి చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అవుతాయి. ఎక్కువగా వచ్చే వ్యాధుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్, గుండెపోటు, డయాబెటీస్ వస్తుంటాయి. ఇవి పురుషులకు వచ్చే వ్యాధులు.

ఇలా వయస్సు మీద పడుతున్నా కొద్ది వస్తుంటాయి. అయితే ఇలా వచ్చినప్పుడే జాగ్రత్త పడే కంటే.. రాకుండా ఉండటానికి ఏం చేయాలో చాలా మంది ఆలోచించరు. దాని కోసం మంచి ఆహారం, వ్యాయామం లాంటివి చేస్తే జబ్బులు వచ్చే సమయం అనేది కాస్త దూరం జరుగుతుంది. దాదాపు ఎక్కువ శాతం 20 ఏళ్ల లోపు వారికి ఎలాంటి వ్యాధులు అనేవి రావు.
ఈ దశను గోల్డెన్ దశ అంటారు. ఇక 20 నుంచి 30 సంవత్సరాల వయస్సులో డ్రగ్స్, ఆల్కహాల్, పొగతాగడం, మానసిక అసమతుల్యతలతో బాధపడుతుంటాం. ఈ అలవాట్లు 50 ఏళ్ల తర్వాత ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. ఇక 40 నుంచి 50 ఏళ్ల మధ్యలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తుంటాయి. 50 సంవత్సరాల పైన పడితే, పురుషులకు ప్రొస్టేట్ కేన్సర్ లేదా పేగు కేన్సర్ వచ్చే అవకాశాలుంటాయి.
అయితే ఇవి రాకుండా.. ఎప్పటికప్పుడు ఆసుపత్రుల్లో చెకప్ చేయించుకుంటూ జాగ్రత్తగా ఉంటే.. ఇలాంటి సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. ముందుగానే దానికి తగ్గట్లు చికిత్స తీసుకోవచ్చు. అంతే కాకుండా సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు.. ప్రతీ రోజు నడక, వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.




























