మన దేశంలో నివశించే ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతోంది. ఆధార్ కార్డు వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను పొందే అవకాశంతో పాటు బ్యాంక్ అకౌంట్, సిమ్ కార్డ్, ఇతర అవసరాల కోసం ఆధార్ కార్డ్ ఉపయోగపడుతుంది. యూనిక్యూ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా జారీ చేసే ఈ ఆధార్ కార్డుల వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే పలు సందర్భాల్లో ఆధార్ కార్డును ఇతరులు తస్కరించే అవకాశాలు ఉంటాయి.

దేశంలో రోజురోజుకు మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆధార్ కార్డులోని డేటా దుర్వినియోగం అయితే ఇబ్బందులు పడక తప్పదు. అయితే యూఐడీఏఐ ఆధార్ కార్డ్ ఉన్నవారి కోసం కార్డును లాక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆధార్ కార్డును లాక్ చేయడం ఇతరులు కార్డ్ లోని సమాచారాన్ని తస్కరించే అవకాశాలు ఉండవు. ఆధార్ కార్డును ఎక్కడైనా పోగొట్టుకున్నా ఆ కార్డును ఎవరూ వినియోగించే అవకాశం ఉండదు.

యూఐడీఏఐ ఒక మెసేజ్ ద్వారా సులభంగా ఆధార్ కార్డును లాక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆధార్ కార్డును లాక్ చేసుకోవాలని భావించే వాళ్లు ఆధార్ కార్డును రిజిష్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ నుంచి getotp అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 1947 అనే నంబర్ కు మెసేజ్ ను పంపాల్సి ఉంటుంది. ఆ తరువాత మొబైల్ ఫోన్ కు వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది.

మొబైల్ ఫోన్ కు వన్ టైమ్ పాస్ వర్డ్ వచ్చిన తరువాత lockuid అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మొబైల్ ఫోన్ కు వచ్చిన వన్ టైమ్ పాస్ వర్డ్ ను 1947 అనే నంబర్ కు పంపాలి. అలా చేయడం ద్వారా సులభంగా ఆధార్ కార్డును లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here