సాధారణంగా చాలా మంది ఉదయం అల్పాహారం తినడం పూర్తిగా మానేస్తుంటారు. మరికొందరు ఇతర పండ్లు, పాలను తీసుకుంటారు.అదేవిధంగా మరికొందరు అల్పాహారంగా కొన్ని ధాన్యాలను ఒక గిన్నెలో వేసుకొని వాటిలోకి పాలు పోసుకుని అల్పాహారంగా తింటారు. అయితే ఉదయం అల్పాహారంగా ఈ విధమైనటువంటి సెరల్స్ తినడం మంచిదేనా..? వీటిని తినడం వల్ల ఏవైనా సమస్యలు వస్తాయా? అసలు ఉదయం అల్పాహారంగా వీటిని తినడం సరైన పద్ధతేనా అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఉదయం అల్పాహారంగా మనం ఇడ్లీ, దోస, ఉప్మా వంటి వాటిని తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి సమస్యలు తలెత్తవు. కానీ చాలామంది బద్దకం కారణంగా ఇంట్లో ఉన్నటువంటి కొన్ని రకాల ధాన్యాలను కలిపి ఒక గిన్నెలో వేసుకొని పాలను కలిపి తింటూ ఉంటారు. అయితే ఇది పూర్తిగా సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా ఒకేసారి అధిక మొత్తంలో ధాన్యాలు తీసుకోవడం వల్ల అధిక ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
మనం తీసుకునే ఈ దాన్యాలలో ఎక్కువ భాగం కేలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి.అదేవిధంగా వీటిలో షుగర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది కనుక వీలైనంత వరకు ఇటువంటి ధాన్యాలను ఉదయం అల్పాహారంగా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.వీటిని తీసుకోవడం వల్ల మన శరీరం అధిక బరువు పెరగడమే కాకుండా మధుమేహ వ్యాధి బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి.
ఈ విధంగా ప్రతి రోజు ఉదయం అల్పాహారంగా ధాన్యాలను తీసుకోవటంవల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి కనుక వీటిని తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ విధమైనటువంటి అల్పాహారం తీసుకునేవారు కొన్ని స్పూన్ల ధాన్యాలను వేసుకొని అందులోకి సరిపడేంత పాలను వేసుకొని తిన్నప్పుడే సరైన మోతాదులో కార్బోహైడ్రేట్లు, క్యాల్షియం మన శరీరానికి అందుతుందని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు


































