సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల లేదా ఎప్పుడు పడితే అప్పుడు అడ్డూ అదుపు లేకుండా భోజనం చేయటం వల్ల విపరీతమైన శరీర బరువు పెరుగుతారని తెలియజేస్తుంటారు. ఈ విధంగా అడ్డూ అదుపు లేకుండా ఏది పడితే ఆహారం తినడం వల్ల అధిక శరీర బరువు పెరిగి ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న సమస్యలలో అధిక బరువు సమస్య ఒకటి. ఈ క్రమంలోనే ఎంతోమంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు.

ఈ విధంగా అధిక శరీర బరువు పెరగడానికి గల కారణం రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల శరీర బరువు పెరుగుతారని చాలా మంది భావిస్తుంటారు. నిజంగానే రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత భోజనం చేయడం వల్ల శరీర బరువు పెరుగుతారా? లేదా అనే విషయాలపై పరిశోధకులు ఎన్నో అధ్యయనాలు జరిపి అసలు విషయం తెలిపారు.
రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేసే పిల్లల్లో అధిక బరువు ఊబకాయం సమస్యలు తలెత్తుతాయా అనే విషయాలు తెలుసుకోవడం కోసం యూకేలోని నేషనల్ డైట్ అండ్ న్యూట్రిషన్ సర్వే రోలింగ్ ప్రోగ్రాం నుంచి సేకరించారు. ఈ అధ్యయన ఫలితాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించారు. ఈ పరిశోధనల ఆధారంగా అర్థరాత్రి లేదా రాత్రి ఎనిమిది దాటిన తరువాత భోజనం చేయడానికి, శరీర బరువు పెరగడానికి ఏమాత్రం సంబంధం లేదని పరిశోధకులు తేల్చి చెప్పారు.
రాత్రి సమయాలలో ఆలస్యంగా తినడం వల్ల ఎలాంటి శరీర బరువు పెరగరు కానీ మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల అధిక శరీర బరువు పెరుగుతారని నిపుణులు తెలియజేశారు. రాత్రి సమయాలలో ఎక్కువగా తీపి పదార్థాలను తీసుకోవడం, అదేవిధంగా ఉప్పు అధికంగా కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి అధిక కేలరీలు అందుతాయి.ఈ విధంగా అధిక కేలరీలు కలిగిన ఆహార పదార్థాలను రాత్రి సమయాలలో ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీర బరువు పెరగడంతో ఊబకాయానికి దారి తీస్తుందని నిపుణులు తెలియజేశారు.