Sharmila: వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరిగా వయసు షర్మిల అందరికీ ఎంతో సుపరిచితమే అన్న విజయానికి గత ఎన్నికలలో ఎంతో దోహదం చేసినటువంటి షర్మిల గత మూడు సంవత్సరాలుగా తన అన్నయ్యకు దూరంగా ఉంటూ తెలంగాణలో పార్టీ పెట్టారు. అయితే ప్రస్తుతం ఆ పార్టీని ఈమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ మూడేళ్ల కాలంలో తన అన్నయ్య పేరు మాట్లాడటానికి కూడా షర్మిల ఇష్టపడలేదు అంతగా వీరిద్దరి మధ్య ఏం మనస్పర్ధలు వచ్చాయనే విషయాలు తెలియకపోయినా జగన్ కి వ్యతిరేకంగా షర్మిల పోరాటం చేశారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇకపోతే తాజాగా షర్మిల తన అన్నయ్య వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.
దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మొదటిసారి అన్నయ్యను కలిశారు తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి జరుగుతున్నటువంటి నేపథ్యంలో వివాహ ఆహ్వాన పత్రికను అందించడం కోసం షర్మిల జగన్మోహన్ రెడ్డిని కలిశారు. షర్మిలతో పాటు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలాగే అట్లూరి ప్రియ తల్లిదండ్రులు ఉన్నారు.
అందరి ఆశీర్వాదం కావాలి..
జగన్మోహన్ రెడ్డితో షర్మిల దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు ఇలా అరగంట పాటు వీరు మాట్లాడుకోవడంతో రాష్ట్ర రాజకీయ పార్టీలలో పలు చర్చలు మొదలయ్యాయి అసలేం మాట్లాడుకున్నారు అనే విషయాల గురించి చర్చలు జరుగుతున్నాయి ఇక తాడేపల్లి నుంచి బయటకు వచ్చిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు అయితే మీడియా బలవంతం చేయడంతో కుమారుడి పెళ్లి ఆహ్వాన పత్రికను ఇవ్వడం కోసమే అన్నను కలిశానని తెలిపారు. అన్న సానుకూలంగా స్పందించారు పెళ్లి కదా నా బిడ్డకు ప్రతి ఒక్కరి ఆశీర్వాదం కావాలి అంటూ ఈమె చాలా సానుకూలంగా స్పందించినప్పటికీ వీరి భేటీ పై ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.



























