ప్రస్తుతం దేశంలోని చాలామంది ప్రజలు ఉరుకుల పరుగుల జీవితానికి అలవాటు పడ్డారు. ఏ పనినైనా వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు, వేగంగా ఫలితాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆఖరికి తినే తిండి విషయంలో కూడా వేగంగా పూర్తి చేయడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే దేశంలోని వైద్య నిపుణులు మాత్రం వేగంగా తిండి తినడం వల్ల నష్టమే తప్ప ఎటువంటి లాభం ఉండదని… అలా తింటే ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్లు అవుతున్నారని చెబుతున్నారు.

నెమ్మదిగా తింటే మాత్రమే తిన్న ఆహారం వల్ల శరీరానికి ప్రయోజనం చేకూరుతుందని బరువు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని వెల్లడిస్తున్నారు. ఎవరైతే వేగంగా భోజనం తింటారో వారు కడుపు ఉబ్బరం సమస్య బారిన పడే అవకాశం ఉంటుంది. ఎవరైతే కడుపు ఉబ్బరం సమస్యతో ఎక్కువ రోజులు బాధ పడతారో వారు డయాబెటిస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వేగంగా తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ఆహారం కంటే ఎక్కువ ఆహారం తీసుకుంటాం. ఫలితంగా బరువు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే నిదానంగా తింటారో వాళ్లు తక్కువ బరువు ఉంటారని.. ఎవరైతే వేగంగా తింటారో వాళ్లు ఎక్కువ బరువు ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేగంగా ఆహారం తీసుకున్న వారిలో ఉక్కిరిబిక్కిరి అయినట్లు ఉంటుంది.
అందువల్లే శాస్త్రవేత్తలు సైతం భోజనం నెమ్మదిగా తినాలని సూచిస్తుంటారు. భోజనం చేసే సమయంలో టీవీకు, మొబైల్ కు దూరంగా ఉంటే ఆహారాన్ని తగినంత తీసుకోవడంతో పాటు శరీరానికి ప్రయోజనాలు చేకూరుతాయి. అలా కాకుండా తిండి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.































